పవన్ కి స్మూత్ ఆన్సర్ ..

0
245
tdp leaders giving smooth answer to pawan kalyan about uddanam people kidney patients

Posted [relativedate]

tdp leaders giving smooth answer to pawan kalyan about uddanam people kidney patientsఉద్దానం కిడ్నీ బాధితుల అంశం మీద జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సూచనలు,డెడ్ లైన్స్ గురించి టీడీపీ నేతలు,బీజేపీ కి చెందిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి స్మూత్ గా ఆన్సర్ ఇచ్చారు. ముందుగా శ్రీకాకుళం జిల్లాకి చెందిన మంత్రి అచ్చెన్నాయుడు,ఎంపీ రామ్మోహన్ నాయుడు పవన్ విమర్శలకి జవాబిచ్చారు. పవన్ చొరవని ఆహ్వానిస్తున్నట్టు చెప్పిన అయన …డయాలసిస్ ఆవశ్యకతని గుర్తించాలని కోరారు.సమస్య పరిష్కారానికి అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు. ఇక జిల్లా మంత్రి అచ్చెన్నాయుడు ఉద్దానంలో నాలుగుసార్లు పర్యటించినట్టు చెప్పారు.సమస్య పరిష్కారం కోసం నిధుల ఇబ్బంది లేదని …అయితే అంతర్జాతీయ స్థాయి బృందాలకు సైతం ఇప్పటిదాకా సమస్యకు మూలకారణం అర్ధం కాలేదన్నారు.ఏమైనా బాధితుల్ని ఆదుకోవడంలో ముందుంటామని చెప్పారు.

ఇక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని కూడా బాధితుల గొంతుక వినిపించినందుకు పవన్ ని అభినందిస్తున్నామని చెప్తూనే ప్రభుత్వ వైఫల్యం లేదని అన్నారు.కొన్ని పరిశోధనల్లో నీటిలో సిలికాన్ శాతం ఎక్కువగా ఉండటం వల్లే ఈ సమస్య ఉత్పన్నమవుతున్నట్టు చెప్తుండగా …మరికొన్ని పరిశోధనల్లో మూలకారణం తెలియలేదన్నారు.అందుబాటులో వున్న సమాచారం ఆధారంగా బాధిత గ్రామాలకి వాటర్ ప్లాంట్స్ ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు.ఏదేమైనా సమస్యని స్వయంగా సీఎం దాకా తీసుకెళ్తానని చెప్పిన పవన్ కానీ …ఆయనకి సమాధానమిచ్చిన మంత్రులు గానీ స్మూత్ గా మాట్లాడ్డం ఆశ్చర్యకరమే ..

Leave a Reply