పవన్ కి జోల పాడుతున్న టీడీపీ ..

0
418
tdp leaders praising pawan

Posted [relativedate] 

tdp leaders praising pawan
రాజకీయాల్లో శత్రువు మిత్రుడు కావొచ్చు …మిత్రుడు శత్రువు కావొచ్చు.కానీ ఒక్కసారే శత్రువుగా,మిత్రుడుగా ఉండటం కష్టం.కానీ ఇక్కడ కూడా ప్రియ శత్రువు ఉండొచ్చని అర్ధం అవుతోంది ఏపీ రాజకీయాల్ని చూస్తుంటే.ఒకవైపు పవన్ నిప్పులు కురిపిస్తున్నా టీడీపీ మాత్రం ప్రేమ ఒలకబోస్తోంది.పవర్ స్టార్ ఎంత ఘాటు పంచ్ లు వేసినా దేశం నేతలు సున్నితంగా జవాబిస్తున్నారు.శత్రువు ఎంతటివారైనా నిప్పులు కురిపించే దేశం ఎమ్మెల్యే బోండా ఉమా ఈసారి మాత్రం పవన్ సూచనల్ని పాటిస్తామని చెప్పారు.సుజనా,రాయపాటి వ్యాపార లావాదేవీల్ని పవన్ ప్రశ్నిస్తే వీళ్ళు మాత్రం వారిపై క్రిమినల్ కేసుల్లేవని జవాబు ఇచ్చారు.అంతకన్నా ముఖ్యంగా జనసేనతో తమ స్నేహం కొనసాగుతుందని ఆయన ప్రకటించారు.ఇక స్వయంగా రాయపాటి తన మిత్రుడు అయినందునే పవన్ ఇలా అంటున్నాడని వాతావరణాన్ని చల్లబరిచే ప్రయత్నం చేశారు.పైగా బ్యాంకులకు అప్పన్న మాట నిజమే గానీ ఎగ్గొట్టలేదని వివరణ ఇచ్చారు.ఇలా ప్రత్యేక హోదా అంశంలో రెచ్చిపోతున్న పవన్ కి జోల పాడేందుకు టీడీపీ విశ్వప్రయత్నం చేస్తోంది.

Leave a Reply