చంద్రబాబు లాంటి హెడ్మాస్టర్‌ ఉంటేనా…?

Posted October 6, 2016

 tdp leaders said kl university classes chandrababu headmaster

”… ఈ పాటికి ఐఏఎస్‌, ఐపీఎస్‌ అయిపోయి చెలరేగుతూ ఉండేవాళ్లం. బాబుగారి లాంటి హెడ్మాస్టరు లేకపోబట్టి సరిగ్గా చదువు అబ్బక.. ఇదిగో.. ఇప్పుడిలా ఈ అర్థం కానివన్నీ ముందేసుకుని కుస్తీలు పడుతున్నాం” 

కోనేరు లక్ష్మయ్య యూనివర్సిటీలో చేతిలో పుస్తకాలు, ట్యాబ్‌, మెడలో ఐడీ కార్డున్న ట్యాగ్‌లతో తరగతి గదుల్లో బుద్ధిగా కూర్చుని వింటున్న, కంప్యూటర్ల ముందు అర్థంకాని సంగతులతో కుస్తీలు పడుతున్న ఎమ్మెల్యేలు, సీనియర్‌ ప్రజాప్రతినిధులలో మెజారిటీ ఎవరిని కదిలించినా ఇలాంటి మాటలే వినిపిస్తున్నాయి. 

పార్టీ ప్రజాప్రతినిధులకు చంద్రబాబునాయుడు మూడు రోజుల శిక్షణ సమావేశాలు అంటూ ఏర్పాటుచేసిన సంగతి అందరికీ తెలిసినదే. తొలిరోజు రాజకీయ విషయాలు బోదించిన చంద్రబాబు.. రెండో రోజు ఫోకస్‌ మొత్తం టెక్నాలజీ మీద పెట్టారు. పొద్దస్తమానం ఆధునిక టెక్నాలజీ అంటూ కంప్యూటర్ల ముందు కూర్చోబెట్టి తమకు జ్ఞానం ప్రసాదించడానికి నిపుణులు కసరత్తు చేస్తోంటే.. పాపం.. ఇలాంటి పనులు అలవాటు లేని ఎమ్మెల్యేలు, మంత్రులు సీనియర్‌ నాయకులు కంగారెత్తిపోయారు. 

అలాగని మీడియా అడిగినప్పుడు నెగటివ్‌గా ఏమీ చెప్పలేరు. కాకపోతే.. ”చిన్నప్పుడు స్కూలుకు వెళ్లి చదువుకునే రోజులు గుర్తుకు వస్తున్నాయని, బాల్యంలో మాకు చంద్రబాబు లాంటి హెడ్మాస్టరు ఉండి ఉంటే.. ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు అయిపోయి ఉండేవాళ్లం అని.. ఇప్పుడిలా కుస్తీలు పట్టే ఖర్మ ఉండేది కాదని” వ్యాఖ్యానిస్తున్నారట. సూటిగా అనలేక, సగం సెటైర్లు వేసుకుంటూ.. చంద్రబాబు మీద తమలో తాము అక్కసు వెళ్లగక్కుకుంటున్నారట. 

అయితే చంద్రబాబు ఆ పదం వాడుతున్నారు గనుక.. అందరూ ‘టెక్నాలజీ’ అనే పదాన్ని మూకుమ్మడిగా వాడుతున్నారే ఏది ఏమిటో.. ఎవ్వరికీ పెద్దగా క్లారిటీగా తలకెక్కుతున్నట్లుగా మాత్రం కనిపించడం లేదు. 

చాలా మందిలో వ్యక్తం అవుతున్న అభిప్రాయం ఏంటంటే.. ”ఈ కంప్యూటరు గొడవలన్నీ మాకెందుకు, మేమేమైనా కంప్యూటరు ముందు కూర్చుని, ట్యాబ్‌ ముందు పెట్టుకుని చేయబోతామా? ఏమన్నానా? మా పనులన్నీ మా పీఏలు చేయాల్సిందే కదా.. ఇలాంటి శిక్షణ ఏదో మా పీఏలకు ఇస్తే సరిపోతుంది కదా.. దానివల్లనే ఎక్కువ ఉపయోగం ఉంటుంది” అంటూ వ్యాఖ్యానిస్తున్నారట. 

అయితే చంద్రబాబు మోనార్క్‌ గనుక, తమకు నచ్చినా నచ్చకపోయినా, తమ బుర్రల్లోకి ఎక్కినా ఎక్కకపోయినా.. ఆయన చెప్పదలచుకున్న శిక్షణ మొత్తం పూర్తయ్యేదాకా విడిచిపెట్టడు గనుక.. ఈ మూడురోజులూ భరించి వెళ్లిపోవడమే మంచిదని ఫిక్సవుతున్నారట. 

galla-jayadevtdp-leaders-training-classetdp-leaders-training-classetdp-leaders-training-classes-kl-university-2tdp-leaders-training-classes-kl-university-1lokesh-at-kl-university-1

SHARE