బాబు బళ్ళో పాఠాలు..ఎమ్మెల్యేలకు చుక్కలు

Posted October 5, 2016

 tdp leaders training classes kl university
Kl యూనివర్సిటీలో టీడీపీ నేతలకోసం సాగుతున్న వర్క్ షాప్ దృశ్యాలు చూస్తే పగలబడి నవ్వుకోవాల్సిందే.అక్కడ ఏపీ ప్రజాప్రతినిధులు పడుతున్న పాట్లు అలాంటివి.అవి పెద్ద కష్టాలా అనుకోబాకండి.ఒక్కసారి ఎమ్మెల్యేల్ని కదిలించి చూడండి.ముందుగా లాప్ టాప్ ల విషయమే తీసుకుందాం ..వాటిమీద ఎక్కడ పని చేయమంటారో అని చాలా మందికి గుర్తున్నా అవి లేకుండానే వచ్చారు.అయినా హెడ్ మాస్టర్ చంద్రబాబు వదిలిపెడితేగా..లాప్ టాప్ వినియోగం గురించి ఓ నిపుణుడు వివరించాడు.అయినా అర్ధం కాక చాలా మంది దిక్కులు చూస్తూనే వున్నారు.ఇక తప్పదనుకున్నాక పక్కన కాస్త అవగాహన వున్న వారిని అడిగి తెలుసుకోవడం మొదలెట్టారు.

ఎక్కడికెళ్లినా గంభీరంగా ఉండి పక్కన పదిమందిని తిప్పుకునే ఎమ్మెల్యేల్ని ఆలా చూస్తుంటే స్కూల్ పిల్లలు గుర్తొచ్చారు. ఇక యోగ చేయడానికి టీడీపీ ప్రజాప్రతినిధులు నానా హైరానా పడిపోయారు.అక్కడ చూసేవాళ్ళకి,చేసేవాళ్ళకి కూడా కడుపు ఉబ్బిపోయేంత నవ్వులు,కాలక్షేపం.ఇక మంతెన సత్యనారాయణ  రాజు ఆహార నియమాల గురించి చెప్పేటప్పుడు మాత్రం అంతా ఆసక్తిగా విన్నారు.కొద్దిమంది మాత్రం ఆ తిండి తినలేమని,సరిపోదని గొణుక్కోవడం కనిపించింది.మొత్తానికి బాబు బళ్ళో పాఠాలు నేతలకి చుక్కలు చూపించాయి.

tdp-leaders-training-classegalla-jayadevtdp-leaders-training-classetdp-leaders-training-classes-kl-university-1tdp-leaders-training-classes-kl-university-2

SHARE