Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకటరావు ని మంత్రివర్గంలోకి తీసుకోవడంతో మళ్లీ ఆ స్థానాన్ని ఎవరితో భర్తీ చేయాలి అన్నదానిపై చంద్రబాబు కసరత్తు మొదలెట్టారు.ఈసారి ఆ పదవి కాపులకి కాకుండా ఓ దళితుడికి ఇస్తే ఎలా ఉంటుంది అన్న అంశంపై విస్తృతంగా చర్చిస్తున్నారు. ప్రతిపక్ష ఓటు చీలేలా ప్రత్యామ్న్యాయం వుండాలని బాబు ప్లాన్ చేస్తున్నారు.ముఖ్యంగా వైసీపీ కి అండగా ఉంటున్న ఎస్సీ లను ఆకట్టుకోడానికి ఏపీ టీడీపీ పగ్గాలు ఆ వర్గానికి చెందిన నేతకి అప్పగించాలన్న ప్రతిపాదన వైపు మొగ్గుజూపుతున్నారు.తెలంగాణాలో రమణ టీడీపీ అధ్యక్షుడిగా వున్నారు.ఆయన బీసీ వర్గానికి చెందిన వారు.ఇక ఏపీ కి వచ్చేసరికి ఇంతకు ముందెన్నడూ లేని విధంగా దళితుడికి పార్టీ సారధ్య బాధ్యతలు అప్పగించి టీడీపీ కి పాత ఇమేజ్ తీసుకురావాలని బాబు భావిస్తున్నారు.
ఒకవేళ ఎస్సీ కి టీడీపీ పగ్గాలు అప్పగించదలుచుకుంటే ఎవరికి ఆ స్థానం ఇవ్వొచ్చు అనే కోణంలోనూ చర్చలు జరుపుతున్నారు బాబు.ముందుగా ఆ రేసులో టీడీపీ సీనియర్ నేత జె.ఆర్.పుష్పరాజ్ పేరు పరిశీలనలోకి వచ్చినట్టు తెలుస్తోంది.ఆది నుంచి టీడీపీ లో ఉండటమే కాకుండా పార్టీ లో తగిన ప్రాధాన్యం దక్కని సమయాల్లోనూ పుష్పరాజ్ సంయమనం తో వ్యవహరించారు.ఇప్పుడు పార్టీ అధ్యక్ష పదవికి ఆయన్ని పరిశీలించడానికి అదే కారణం అని తెలుస్తోంది.