Posted [relativedate]
ఏ రకంగా చూసినా నరసరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు,తెనాలి ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్ మధ్య ఏ పోటీ లేదు.అయితే తాజాగా ఏపీ మంత్రివర్గ విస్తరణ సందర్భంలో మాత్రం ఆ ఇద్దరూ ఒకే రోల్ ప్లే చేయాల్సి వచ్చింది.పోటీ పడాల్సి వచ్చింది.శిష్యులకు మంత్రి పదవులు తెప్పించుకోడం కోసం ఈ ఇద్దరూ గురువులుగా తమ వంతు ప్రయత్నం చేయాల్సి వచ్చింది.రాయపాటి తన శిష్యుడైన డొక్కా మాణిక్యవరప్రసాద్ ని కాంగ్రెస్ నుంచి టీడీపీ లో చేర్పించడమే కాదు ఎమ్మెల్సీ గా అవకాశం ఇప్పించగలిగారు.డొక్కా కూడా టాలెంటెడ్ కావడం, రాయపాటి అండ ఉండటంతో ఇక మంత్రి పదవి కూడా ఖాయం అనుకున్నారు.కానీ పోటీ ఎక్కువ కావడంతో ఆ గురుశిష్యుల ప్రయత్నాలు ఫలించలేదు.
ఇక వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు కి క్యాబినెట్ లో చోటు దక్కడం వెనుక ఆయన రాజకీయ గురువు,తెనాలి ఎమ్మెల్యే ఆలపాటి పాత్ర ఎంతో వుంది.నిజానికి ఇక్కడ ఓ వింత కూడా వుంది.గురువు కన్నా శిష్యుడి వయసు ఓ రెండేళ్లు ఎక్కువ.అయినా వేమూరు లో ఆదినుంచి ఆలపాటి శిష్యుడిగా నక్కా పార్టీలో ఎదిగారు.నియోజకవర్గాల పునర్విభజనలో వేమూరు ఎస్సీ రిజర్వుడ్ కావడంతో రాజా తెనాలి వెళ్లారు.బాబుని ఒప్పించి వేమూరులో శిష్యుడు నక్కా కి అవకాశం ఇప్పించారు.ఆ బంధం అప్పటినుంచి ఇంకా బలపడింది.ఇక తాజాగా క్యాబినెట్ రేసులో జిల్లాలో ఎమ్మెల్యేలు ఎందరో పోటీపడ్డారు.కానీ రాజా మాత్రం జిల్లా సమీకరణాలు అర్ధం చేసుకుని తన కోసం కాకుండా నక్కా ఆనంద్ కోసం గ్రౌండ్ వర్క్ చేసి శిష్యుడికి మంత్రి పదవి దక్కేలా చేయగలిగారు.ఆ విధంగా గురువు రోల్ లో రాయపాటి ఫట్ అయితే ఆలపాటి హిట్ అయ్యారు.కానీ ఎక్కడలేని స్పోర్టివ్ స్పిరిట్ తో రాయపాటి మంత్రి అయ్యాక తన ఇంటికి వచ్చిన నక్కా ఆనంద్ బాబు ని ఆత్మీయంగా సత్కరించారు.