మోడీని రెచ్చగొడుతున్న దేశం ఎమ్మెల్యే…

0
474

 tdp mla srinivasa rao fair modi

అసలే మోడీ … ఆపై అధికారం … అందుకే చంద్రబాబు అంతటి నేత కూడా తాను అరిటాకునని చెప్పకనే చెప్పారు. అధినేత అలా మాట్లాడితే ఇక ఎమ్మెల్యేలు ఎలా వుండాలి? అదేం పట్టినట్టు లేదు గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు గారికి.

మోడీ – చంద్రబాబు మధ్య పోలిక తెస్తూ యరపతినేని ఘాటు వ్యాఖ్యలే చేశారు. మోడీ కన్నా చంద్రబాబే రాజకీయాల్లో సీనియర్ అని చెప్పారు. అంతటితో ఆగలేదు… చంద్రబాబు ఇన్నిసార్లు అడిగినా కేంద్రం సాయం చేయకపోవడం కుట్రేనని కూడా యరపతినేని డౌట్ వ్యక్తం చేశారు. అక్కడికీ ఆగలేదు ఆయన… దేవెగౌడ టైమ్ లో అవకాశం వచ్చినా బాబు ప్రధాని పీఠాన్ని వదులుకున్నారని చెప్పారు. అంటే బాబుగారు వదిలేసిన పదవిలో కురుహోన్నారని చెప్పదల్చుకున్నారా? అసలే కమలం వేగులు ఏ అవకాశం దొరుకుతుందా అని చెవులు రిక్కించి వింటున్నారు. మీ మాటలు ఢిల్లీకి, మోడీకి చేరితే?… తస్మాత్ జాగ్రత్త…

Leave a Reply