జగన్ కి ఆమెతో చేటు..

Posted October 15, 2016

  tdp mlc buddha venkanna counter on jagan and roja
వైసీపీ అధినేత జగన్ కి ఆమెతో చేటు తప్పేట్టు లేదు.ఆమె ఎక్కడో ఏదో అస్త్రం ప్రయోగిస్తే అది అటు తిరిగి ఇటు తిరిగి డబల్ స్పీడ్ తో జగన్ మీదకొస్తోంది.ఇలా జరగడం ఇదే మొదటిసారి కాదు. ఇప్పుడు మరోసారి అదే చేదు అనుభవం ఎదురైంది.ఇంతకీ ఆమె ఎవరో మీకు అర్ధమయ్యే ఉంటుంది.వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజా ..లోకేష్ ని టార్గెట్ చేస్తూ డిక్కీ బలిసిన డాష్,సిమ్ లేని సెల్ ఫోన్ అని రోజా చెలరేగిపోయింది.ఇప్పుడు టీడీపీ నాయకుడు,ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న కౌంటర్ ఇచ్చాడు.అయన తిట్టిన రోజాతో పాటు జగన్ ని కూడా కలిపి ఏకిపారేశాడు.

బుద్ధా డైలాగ్స్ ఇవే …
1. చంద్రబాబు,లోకేష్ పై శిఖండిలా రోజాని ప్రయోగిస్తోంది వైసీపీ
2.రోజా వైసీపీ కి పెయిడ్ వర్కర్
3 . జగన్ బాటరీ లేని సెల్ ఫోన్
4.జగన్ హైదరాబాద్,బెంగళూరు కే పరిమితం.
5.ఎన్నికల ముందే జగన్ రాష్ట్రానికి వస్తాడా?

SHARE