Posted [relativedate]
వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజా క్షమాపణ చెప్పకపోయినా ఆమెని మరో ఏడాది సస్పెండ్ చేయకుండా ఉండటం పొరపాటని టీడీపీ భావిస్తోంది.రోజా ని కంట్రోల్ చేయకపోతే తాము డిఫెన్స్ లో పడాల్సివస్తుందని డిసైడ్ అయిన అధికారపక్షం పాత అస్త్రాలు కొన్నిటిని కొత్తగా ప్రయోగిస్తోంది. టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న కి ఈ బాధ్యతలు అప్పగించింది.ఆయన రోజాని టార్గెట్ చేస్తూ చెలరేగి మాట్లాడారు.ఆయన ఏమన్నారంటే….
“రాజకీయాల్లో విలువలను రోజా పాటించడం లేదు. ఆమె స్త్రీ అని, ఆమెకు పిల్లలున్నారని… ఏవైనా విమర్శలు చేస్తే వారు బాధపడతారని మే చేయడం లేదు.
· రోజా నీతులు చెబుతుంటే… బూతుల్లా ఉన్నాయ్… రోజా సెక్స్ రాకెట్ నిర్వహించినప్పుడు ఒక ఐపీఎస్ భార్య నిన్ను తిట్టింది వాస్తవం కాదా…?
· కాల్ మనీ గురించి మాట్లాడుతున్నావ్. నువ్వు చెల్లని చెక్కులు ఇస్తే నీకు ఎన్నిసార్లు జైలు శిక్ష పడింది. హద్దు-అదుపు లేకుండా మాట్లాడుతున్నావ్… మీ పార్టీలో చాలా మంది ఎమ్మెల్యేలు గౌరవంగా మాట్లాడేవారు ఉన్నారు. శ్రీకాంత్ రెడ్డిగారు చాలా మర్యాదగా మాట్లాడతారు. నీకు ఆ గౌరవ మర్యాదలు లేవు. నువ్వు లెగ్ పెట్టగానే వైఎస్సార్ చనిపోయాడు. అసెంబ్లీ ప్రశాంతంగా జరుగుతుంటే… రెండో రోజు నువ్వు వచ్చావు గొడవలు మొదలయ్యాయి. ఖబడ్దార్ జాగ్రత్తగా మాట్లాడు.
· నువ్వు రోజూ ఏదో డైలాగులు రాసుకొచ్చి మాట్లాడుతున్నావ్…సబ్జెక్ట్ పై మాట్లాడుతున్నావా… ఇదేమైనా జబర్దస్ అనుకున్నావా… ఇది అసెంబ్లీ…
· టీడీపీలో ఉన్నప్పుడు వైఎస్సార్ ను తిట్టావు. రేపు ఇంకో పార్టీలోకి వెళ్తే జగన్ ను తిడతావు.
· సూర్పణకకు లక్ష్మణుడు ముక్కూ చెవులు కోశాడు. నీకు ముక్కు చెవులతోపాటు నాలుక కూడా కోయాలి.
· శిశుపాలుడికి నూటక్క తప్పులు పూర్తయినట్టు నీకు కూడా 101 తప్పులు పూర్తయ్యాయి. నువ్వు మోనార్క్ అనుకుంటున్నావా… చంద్రబాబును నువ్వు ఏకవచనంతో మాట్లాడితే మేం జగన్ ను తిడతాం. నువ్వు టీడీపీలో ఉన్నప్పుడు పెయిడ్ యాక్టర్ గా ఉన్నావు. ఇప్పుడు వైసీపీలో కూడా పెయిడ్ యాక్టర్ గా ఉన్నావు. నీకో సిద్ధాంతం ఉందా…? “