అది వచ్చే దాకా ఆయన గెడ్డం గీయరు…

0
444

 tdp mp maganti babu dont shave coming special status

స్వతంత్ర దేశంలో అహింసాయుత నిర‌స‌న‌ల్లో ఇదో ట్రెండ్… మాగంటి గారి గెడ్డం నిర‌స‌న‌. ..ఏపీకి ప్రత్యేక హోదా విషయం రాష్ట్ర ఎంపీల‌ను ఎంత‌గా ఉక్కిరిబిక్కిరి చేసేస్తోందో చెప్పడానికి ఇదో ఎగ్జాంపుల్… హోదాపై ఇప్పటి వ‌ర‌కు అనేక రూపాల్లో అధికార ప‌క్ష ఎంపీలు, విప‌క్ష వైకాపా ఎంపీలు త‌మ నిర‌స‌న‌ను వ్య‌క్తం చేశారు. అయితే, ఇప్పుడు ఇక‌, వ్య‌క్తిగ‌తంగా కూడా కేంద్రంపై నిర‌స‌న తెలిపేందుకు సిద్ధ‌మైపోయారు అధికార ప‌క్ష ఎంపీలు. ఇప్ప‌టికే చిత్తూరు ఎంపీ, సినీ న‌టుడు శివ‌ప్రసాద్‌.. త‌న స్టైల్లో వివేకానందుడి వేషం వేసి.,. ఇర‌గదీశారు.

ఇటీవ‌ల ఆయ‌న వేసిన వేషంపై పార్ల‌మెంటు స‌భ్యులు తెగ చ‌ర్చించుకున్నారు.అంత‌కు ముందురోజు కూడా శివ‌ప్రసాద్.. భార‌తంలోని అలుగుట‌యే ఎరుంగ‌ని మ‌హామ‌హితాత్ముడే అలిగిన నాడు అంటూ మీడియా ముందు చంద్రబాబుపై పౌరాణిక ప‌ద్యాలు పాడి కేంద్రానికి నిర‌స‌న తెలిపారు. ఇవ‌న్నీ జాతీయ మీడియాలో కూడా ప్రముఖంగా వ‌చ్చాయి. ఇక‌, ఇప్పుడు ఇదే త‌ర‌హాలో ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా ఏలూరు టీడీపీ ఎంపీ మాగంటి బాబు సైతం.. స‌రికొత్త స్టైల్లో నిర‌స‌న వ్య‌క్తం చేస్తున్నారు. హోదా ప్ర‌క‌ట‌న వ‌చ్చే వ‌ర‌కు గెడ్డం తీసేది లేద‌ని ఆయ‌న కుండ‌బ‌ద్దలు కొట్టారు. అంటే.. హోదాపై మాగంటి.. గెడ్డం నిర‌స‌న వ్య‌క్తం చేస్తున్నార‌న్నమాట‌!

ఇప్పుడు పార్ల‌మెంటులో ఇదే హాట్ టాపిక్‌గా మారింది. శరీరాకృతి, తలకట్టులో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా మాదిరి కనిపించే మాగంటి… తాజాగా అమిత్ షా మాదిరే గడ్డం కూడా పెంచ‌డంతో అంద‌రూ ఒకింత ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తున్నారు. అంతేకాదు, ఆంధ్రా అమిత్‌షా అని ఛ‌లోక్తులు విసుతున్నార‌ట‌. ఇక‌, మాగంటి గ‌డ్డం విషయం తెలుసుకుందామ‌ని కేంద్ర మంత్రి వెంక‌య్య‌నాయుడు ప్ర‌య‌త్నించారు. దీనికి బాబు.. ‘మీరు ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేదాకా గడ్డం గీసేది లేదు’ అని చెప్పడంతో వెంక‌య్య షాక్ తీన్నారని టాక్..

Leave a Reply