భగ్గుమన్న జనం …దేశంలో భయం

   tdp politician scared because ap peoples fires about ap package
ప్రత్యేక హోదా విషయంలో మోసం చేసిన కేంద్రం చివరకు ప్యాకేజ్ విషయంలోనూ స్పష్టత ఇవ్వకపోవడంతో ఏపీ జనం భగ్గుమంటున్నారు .విభజన సమయంలో కాంగ్రెస్ వైఖరి కన్నా నేడు బీజేపీ తీరు మరీ దారుణంగా ఉందని మెజారిటీ ప్రజలు అభిప్రాయపడుతున్నారు.ఈ అంశంలో ఇంకా కమలం నేతలు చేస్తున్న ప్రకటనలు మరింత అగ్గి రాజేస్తున్నాయి.

ఇక ప్యాకేజ్ అంటూ నానా హడావిడి చేసిన కేంద్రం కేవలం ఓ ప్రకటన మాత్రమే చేసిందని ప్రజలే కాదు టీడీపీ వర్గాలు కూడా భావిస్తున్నాయి .సోషల్ మీడియా లో బీజేపీ పై ఆంధ్రుల ఆగ్రహాన్ని చూస్తున్న దేశం భయపడుతోంది .కమలనాధులు చేసిన తప్పుకు తాము బలైపోతామని ఆ పార్టీ నేతలు ఆంతరంగిక చర్చల్లో ఒప్పుకుంటున్నారు .చంద్రబాబు కూడా పాక్షికంగా స్వాగతం చెప్పడాన్ని పార్టీ ముఖ్యులు తప్పు పడుతున్నారు .

ఈ విషయం బాబుకి కూడా అర్థమైందని ..కానీ ఏమీ చేయలేక ఆలా ఉండిపోయారని కూడా వారు వ్యాఖ్యానిస్తున్నారు .బీజేపీ తాను మునుగుతూ తెలుగు దేశాన్ని కూడా ముంచేస్తోందని తమ్ముళ్లు వాపోతున్నారు .బాబు ఇప్పటికైనా మేలుకొని పోరాట పంధా అనుసరించకపోతే పార్టీ బతికి బట్ట కట్టడం అసాధ్యమని సీనియర్లు భావిస్తున్నారు .అదే విషయాన్ని బాబుకి చెప్పేందుకు ఓ బృందంగా వెళ్లాలని వాళ్ళు నిశ్చయించుకున్నట్టు తెలుస్తోంది .

SHARE