ఉప ఎన్నికల్లో టీడీపీ హవా..

Posted April 11, 2017

tdp victory in elections
టీడీపీ అధికారంలోకి వచ్చాక ప్రత్యక్షంగా జనం ఓటు హక్కు వినియోగించుకున్న తొలి ఎన్నికల్లో అధికార పక్షం హవా కొనసాగింది.వివిధ మున్సిపాలిటీల్లో వేర్వేరు కారణాలతో కొన్ని వార్డులకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు కొద్దిసేపటికిందట వచ్చాయి.రాజధాని ప్రాంత పరిధిలోకి వచ్చిన మంగళగిరి మున్సిపాలిటీ పరిధిలో వార్డ్ లో మాత్రమే వైసీపీ విజయం సాధించింది.మిగిలిన అన్నిచోట్లా టీడీపీ జయకేతనం ఎగరేసింది.ఒకటిరెండు చోట్ల ఇండిపెండెంట్ లు గెలిచారు..ఉప ఎన్నికల ఫలితాలు ఇవే …

 •  గుడివాడ మున్సిపాల్టీ 19వ వార్డు ఉపఎన్నికలో కొడాలి నానీ అభ్యర్థి ఓటమి, టీడీపీ 150ఓట్లతో గెలుపు. వైసీపీ కౌన్సిలర్ మరణంతో ఉపఎన్నిక. గుడివాడ మున్సిపల్ ఛైర్మన్ సహా 9మంది కౌన్సిలర్లు ఇటీవలే టీడీపీలో చేరిక, తాజా గెలుపుతో 36 వార్డులకు గానూ 27కి పెరిగిన టీడీపీకి బలం
 • యలమంచిలి లో 16వ వార్డు టీడీపీ అభ్యర్థి గీత గెలుపు…….
 • గుడివాడ 19వ వాడు లో టీడీపీ
  అభ్యర్థి 150 ఓట్ల మెజార్టీ తో గెలుపు….
 • చిత్తూరు 38 డివిజన్ లో టీడీపీ అభ్యర్థి వసంత కుమార్ 1.508 ఓట్ల మెజార్టీ తో గెలుపు…..
 • గుంటూరు మాచర్ల 15వ వార్డు టీడీపీ అభ్యర్థి 64ఓట్ల మెజార్టీ తో గెలుపు…..
 • మాచర్ల 19వ వార్డు స్వతంత్రంఅభ్యర్థి గెలుపు…
 • తూర్పు గోదావరి జిల్లాలో
  3 వార్డుల్లో టీడీపీ గెలుపు…..
 • మంగళగిరి 31వ వార్డు లో జరిగిన బై-ఎలెక్షన్స్ లో YSR CP అభ్యర్థి రమణయ్య 182 ఓట్ల మెజార్టీ తో గెలుపు….
 •  తాడిపత్రి టీడీపీ వశం
 • అనంతపురం : తాడిపత్రి 4వ వార్డు ఉపఎన్నికలో 417 ఓట్ల మెజార్టీతో వైసీపీ అభ్యర్థిపై టీడీపీ అభ్యర్థి లక్ష్మిదేవి విజయం

  • హిందూపురంలో టీడీపీ పాగా

 • అనంతపురం : హిందూపురం 9వ వార్డు ఉపఎన్నికలో 939 ఓట్ల మెజార్టీతో టీడీపీ అభ్యర్థి బోయ శాంతి విజయం
SHARE