ఇది గెలుపు కాదు …మరది గెలుపేనా జగన్?

0
539
tdp won the mlc elections in kadapa

Posted [relativedate]

tdp won the mlc elections in kadapa
స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల్లో సున్నా తో సరిపెట్టుకోవాల్సి రావడాన్ని వైసీపీ అధినేత జగన్ జీర్ణించుకోలేకపోతున్నారు.టీడీపీ క్లీన్ స్వీప్ ని ఆయన ఓట్లు కొనుగోలుతో చంద్రబాబు సాధించిన అనైతిక విజయంగా అభివర్ణించారు.ఓట్ల కొనుగోలు పధకంలో ఆరితేరిన బాబు దిగజారుడు రాజకీయాలకు జనమే చరమగీతం పడతారని జగన్ అన్నారు.అసలు ఇదీ ఒక గెలుపేనా అని చంద్రబాబుని నిలదీశారు.నిజమే కావొచ్చు..ఇప్పుడు జగన్ ఆవేదన,ఆక్రోశంలో కొంత నిజం లేకపోలేదు.కానీ ఇది ఇలా చేయొచ్చని నేర్పింది ఎవరో గుర్తుందా? ఇలాంటిదే ఓ సంఘటన గుర్తు తెచ్చుకోండి..

2004 లో చంద్రబాబు సర్కార్ ని ప్రజలు గద్దె దించారు.సీఎం పీఠం మీద వై.ఎస్ వెలిగిపోతున్నారు.పరిటాల రవిని రాజకీయ ప్రత్యర్ధులు దారుణంగా హతమార్చారు.ఆ టైం లో స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చాయి.రాష్ట్రమంతటా కాంగ్రెస్ అనుకూల పవనాలు వీచినా అనంతపురంలో టీడీపీ మెజారిటీ స్థానాల్లో గెలిచింది.అయినా అనంత జడ్పీ పీఠాన్ని కైవసం చేసుకోడానికి సీఎం పీఠంలో కూర్చున్న వై.ఎస్ చక్రం తిప్పారు.జడ్పీ సమావేశంలో చైర్మన్ ని ఎన్నుకునే టైం వచ్చింది.వై.ఎస్ కి అమ్ముడుపోయిన కొందరు టీడీపీ గుర్తుతో గెలిచి సమావేశ హాల్ లోనే రెండో వైపుకి వెళ్లిపోయారు.ఇంకా అప్పటికి రాజకీయ వాసనలు అంతగా అంటని సునీతమ్మ గోడ దూకుతున్న ప్రజాప్రతినిధులని బతిమిలాడినా ప్రయోజనం లేకపోయింది.ఫలితంగా అనంత జడ్పీ పీఠం కాంగ్రెస్ వశమైంది.ఆనాడు మీరు జబ్బలుచరుచుకున్న గుర్తు లేదా? అది గెలుపు అయితే ..ఇదీ గెలుపు కాకుంటే ఇదీ గెలుపు కాదు.కానీ జగన్ ఒక్కటి గుర్తు పెట్టుకోవాలి.మనుషుల్ని బట్టి విలువలు మారవు.విలువల్ని బట్టే మనుషుల్ని అంచనా వేస్తారు.అది మీరైనా..చంద్రబాబైనా. గొంగొంట్లో అన్నం తింటూ వెంట్రుకలు ఏరుదామా? ..గొంగట్లో అన్నం తినడం నేర్పిన కుటుంబం నుంచి వచ్చి మరీ వెంట్రుకలు ఏరివేయడానికి చూస్తుంటే నవ్వొస్తోంది.

Leave a Reply