టీజర్‌ టాక్‌ : గౌతంనంద అంచనాలు పెంచేసింది

167
teaser Talk: Gauthamananda ha increased the expectations

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

గోపీచంద్‌ ఇండస్ట్రీకి పరిచయం అయ్యి ఎన్నో సంవత్సరాలు అయినా ఒకటి రెండు తప్ప పెద్దగా కమర్షియల్‌ సక్సెస్‌లు దక్కించుకున్న దాఖలాలే లేవు. అయినా కూడా గోపీచంద్‌ అవకాశాలు అందిపుచుకుంటూ సినిమాల వెనుక సినిమాలు చేస్తూనే ఉన్నాడు. తాజాగా సంపత్‌ నంది దర్శకత్వంలో ‘గౌతంనంద’ చిత్రాన్ని చేస్తున్నాడు. నేడు గోపీచంద్‌ బర్త్‌డే సందర్బంగా ‘గౌతంనంద’ చిత్ర టీజర్‌ను విడుదల చేయడం జరిగింది. టీజర్‌ సినిమా స్థాయిని అమాంతం పెంచేసింది.

‘గౌతంనంద’ చిత్రంలో గోపీచంద్‌ చాలా స్టైలిష్‌గా రిచ్‌ కిడ్‌గా కనిపిస్తున్నాడు. అదే సమయంలో ఒక పల్లెటూరు వాతావరణంలో కూడా ఈ సినిమా కనిపిస్తూ ఉంది. సినిమా టీజర్‌తో సినిమాపై ఆసక్తి కలుగుతుంది. ‘రచ్చ’ వంటి మాస్‌ ఎంటర్‌టైనర్‌ను దర్శకుడు సంపత్‌ నంది మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నాడు. తప్పకుండా ఈ సినిమా ఆకట్టుకుంటుందని టీజర్‌ను చూస్తుంటే అనిపిస్తుంది. అతి త్వరలోనే ఈ చిత్రాన్ని పూర్తి చేసి విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. గౌతంనంద టైటిల్‌ వినగానే పవన్‌ ఫ్యాన్స్‌ ఆసక్తి చూపుతున్నారు. సినిమాకు అది ప్లస్‌ అయ్యే అవకాశం ఉందని సినీ వర్గాల వారు అంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here