సాంకేతిక విప్లవం మొదలైందా ….?

Posted November 29, 2016, 12:09 pm

Related image

భారత దేశం లో సాంకేతిక విప్లవం మొదలైందా…అప్పుడెప్పుడో చదువుకొనే రోజుల్లో హరితవిప్లవం, సామాజిక విప్లవం, స్వాతంత్రయ ఉద్యమ తిరుగు బాటు ఇలా ఉద్యమాలు తిరుగు బట్ల గురించి విన్నాం ..ఇప్పుడు సాంకేతిక విప్లవం .ఐతే సాంకేతికంగా ప్రధాన నగరాల్లో, టెక్నికల్ స్కిల్స్ ఉన్న వారు మాత్రమే సాంకేతిక పరమైన వనరుల్ని వీరివి గా వాడు కొనే వారు ..ఇప్పుడు తాజా గా నరేంద్ర మోడీ సఫాయి కార్యాక్రమాన్ని మొదలుపెట్టిన తర్వాత నోట్ల రద్దు, ప్రతి ఒక్క లావా దేవి నగదు రహితం గా ఉండాలని తద్వారా అవినీతిని ,నల్ల ధనాన్ని అరికట్టాలనేది ప్రభుత్వ ఉద్దేశ్యం.

ఈ దిశగా ప్రభత్వం ఇప్పటికే చాల వరకు నగదు రహిత లావాదేవీ లను క్రెడిట్, డెబిట్ కార్డు లను ప్రవేశ పెట్టింది ప్రతి చిన్న లావాదేవీ ప్రభుత్వ కను సన్నల్లో జరగాలనే ఉద్దేశ్యం తో ముందుగా ఊహకి అందకుండా పెద్ద నోట్లను రద్దు చేసింది. నల్ల కుబేరుల గుండెల్లో రాళ్ళూ పడినా సామాన్య ప్రజలు మాత్రం ఇబ్బంది పడటానికి సిద్దము అయ్యారనేది నిన్నటి బంద్ విఫలం కావడంతో తేలిపోఇన్ది, అక్కడక్కడా విపక్షాలు నిరసన గళం వినిపించినా ,సభల్ని అడ్డుకున్న ప్రభుత్వ బలం, నిజాయతి ముందు నిలవలేక పోయాయి అనే చెప్పాలి .

తాజా గా తెలంగాణా ముఖ్య మంత్రి కూడా ప్రభుత్వ చెల్లిపులన్నీ ఇకపై ఎలక్ట్రానిక్ పద్దతి ద్వారానే చేస్తాం అనటం ఆహ్వానించ దగ్గ పరిణామం. కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి సారధ్యం లో సబ్ కమిటీ వేసి సారధ్యం వహించాలని కోరటం. నెట్ బ్యాంకింగ్ ,ఈ వ్యాలెట్ తదితర అంశాలపై మంచి పట్టున్న హై టెక్ ముఖ్యమంత్రి గా చంద్ర బాబు ఈ టీమ్ కి లీడర్ కావడాన్ని ప్రధాన అర్హత ఐనా..బీజేపీ తో ఏళ్ళ తరబడి స్నేహం అదనపు అర్హత కి దక్కిన గౌరవం గా చెప్పాలి..మొత్తం గా భారత దేశం లో ప్రతి ఒక్కరు ఈ లావాదేవీల పై కనీస అవగాహనా తో పాటు, డెబిట్ కార్డు ని కూడా పొందాల్సిన  అవసరం వుంది. ఒక రకం గా చెప్పాలి అంటే డెబిట్ కార్డు కూడా జీవితంలో భాగం గా మారిపోనుంది .