Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తెలుగమ్మాయి తేజస్వి ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న విషయం తెల్సిందే. అంతకు ముందు చాలా సినిమాల్లో నటించినా కూడా పెద్దగా గుర్తింపు రాలేదు. సీతమ్మ సినిమా తర్వాత హీరోయిన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఈ అమ్మడు పలు సినిమాల్లో నటిస్తూ వచ్చింది. రెండు సంవత్సరాల పాటు ఫుల్ బిజీ హీరోయిన్, నటిగా పేరు తెచ్చుకున్న ఈ అమ్మడు గత కొన్ని నెలలుగా అవకాశాలు లేక దిక్కు చూస్తుంది. ఈ సమయంలోనే ఈమెకు ‘బాబు బాగా బిజీ’ చిత్రం అవకాశం దక్కింది. ఆ సినిమా మంచి విజయాన్ని సాధించి తనకు మళ్లీ ఆఫర్లను తెచ్చి పెడుతుందని భావించింది. కాని తాజాగా విడుదలైన ‘బాబు బాగా బిజీ’ సినిమా సక్సెస్ కాలేదు.
ఆ సినిమాలో చాలా మంది హీరోయిన్స్ ఉండటంతో పాటు ఈమె పాత్రకు పెద్దగా ప్రాముఖ్యత దక్కలేదు. దాంతో ఈమె సినిమాలో ఉందా లేదా అనిపించేలా ఉంది. మొత్తానికి ఈమె ఇకపై టాలీవుడ్ ఆశలు గల్లంతయినట్లే అని సినీ వర్గాల వారు అంటున్నారు. ఈ అమ్మడు తమిళం లేదా మలయాళంలో అవకాశాల కోసం వెదుక్కోవాల్సిందే అంటూ కొందరు సినీ ప్రముఖులు చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం హాట్ ఫొటో షూట్స్‌తో జనాలను రెచ్చగొడుతున్న ఈ అమ్మడు త్వరలోనే మళ్లీ మంచి సినిమాతో వచ్చి తానేంటో నిరూపించుకుంటాను అంటూ చెప్పుకొస్తుంది. కాని ఈమెకు ఆ మంచి అవకాశం ఇచ్చేది ఎవరో చూడాలి.