ఆక‌ట్టుకుంటున్న తెలంగాణ అసెంబ్లీ!!!

 Posted March 24, 2017


ఓవైపు ఏపీ అసెంబ్లీలో యుద్ధ వాతావ‌ర‌ణం క‌నిపిస్తుంటే.. తెలంగాణ అసెంబ్లీలో మాత్రం దీనికి భిన్న‌మైన వాతావ‌ర‌ణం క‌నిపిస్తోంది. ప్ర‌జా స‌మ‌స్య‌లపై అర్థ‌వంత‌మైన చ‌ర్చ జ‌రుగుతోంది. చ‌ర్చ‌ల‌న్నీ చాలా హుందాగా జ‌రుగుతున్నాయి. అప్పుడ‌ప్పుడు వాదోప‌వాదాలు జ‌రుగుతున్నా.. అవి కూడా ఎక్క‌డా ప‌రిధి దాటడం లేదు.

తెలంగాణ అసెంబ్లీ ఎంత హుందాగా జ‌రుగుతుందో చెప్ప‌డానికి ఒక్క ఉదాహ‌ర‌ణ చాలు. ఈమ‌ధ్య జ‌గ‌దీశ్ రెడ్డి మాట‌ల సంద‌ర్భంగా మోడీ పేరును ప్ర‌స్తావిస్తూ మాట జారారు. దీంతో బీజేపీ సీనియ‌ర్ ఎమ్మెల్యే కిష‌న్ రెడ్డికి కోప‌మొచ్చింది. వెంట‌నే ఆయ‌న వెల్ లోకి వ‌చ్చి నిర‌స‌న తెలిపారు. ఆ త‌ర్వాత అసెంబ్లీ వాయిదాప‌డ‌డంతో ప‌రిస్థితి స‌ద్దుమ‌ణిగింది. కానీ త‌ర్వాత రోజుకు సీన్ మారింది. వెల్ లోకి వ‌చ్చినందుకు కిష‌న్ రెడ్డి పశ్చాత్తాపం వ్య‌క్తం చేశారు. అటు జ‌గ‌దీశ్ రెడ్డి కూడా త‌న వ్యాఖ్య‌ల‌కు క్ష‌మాప‌ణ చెప్ప‌డానికి సిద్దంగా ఉన్నాన‌ని ప్ర‌క‌టించారు. తెలంగాణ అసెంబ్లీ న‌డుస్తున్న తీరుకు ఈ ఘట‌నే నిద‌ర్శ‌నం.

టీఅసెంబ్లీలో వెల్ లోకి దూసుకువ‌స్తేనే ప‌శ్చాత్తాపం ప్ర‌క‌టించారంటే.. మ‌రి ఏపీ అసెంబ్లీలో రోజూ ఇంత‌కంటే ఎక్కువ ర‌చ్చ జ‌రుగుతోంది. కానీ అటు అధికార ప‌క్షం కానీ. ఇటు ప్ర‌తిప‌క్షం గానీ త‌గ్గ‌డం లేదు. ఇద్ద‌రూ నువ్వెంత అంటే నువ్వెంత అంటూ ఫైటింగ్ కు సిద్ధ‌మ‌వుతున్నారు. ప్ర‌జాస‌మ‌స్య‌ల‌ను గాలికొదిలేసి వ్య‌క్తిగ‌త దూష‌ణ‌లు… స‌వాళ్లు, ప్ర‌తిస‌వాళ్ల‌తో సినిమాలకు కూడా త‌ల‌ద‌న్న స్థాయిలో హాట్ హాట్ డైలాగులు పేలుస్తున్నారు. అందుకే ఇప్ప‌టికైనా ఏపీ అసెంబ్లీ తీరు మార్చుకోవాలి. తెలంగాణ అసెంబ్లీని ఆద‌ర్శంగా తీసుకోవాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది.!!!

SHARE