తెలంగాణాలో కులపోరా ? ఆధిపత్య పోరా?

 telangana  caste war leading by war
ఆంధ్రప్రదేశ్ లో కులప్రభావం ఎక్కువనేది బహిరంగ రహస్యమే.ఎవరెన్ని చెప్పినా చదువుకునే విద్యాలయాలనుంచే ఇది మొదలైపోతుంది.అందుకు తెలంగాణ సమాజం కొంత భిన్నం.కేవలం కుల ప్ర్రతిపాదికన అన్ని విషయాలు ముఖ్యంగా రాజకీయాలు నడపడం కష్టం .తెలంగాణ కోసం జరిగిన పోరాటం కూడా ఆ కుల హద్దుల్ని చాలావరకు చెరిపేసింది.ఐకమత్యం పెంచింది.తెలంగాణ వచ్చాక ఈ పరిస్థితి మారబోతుందా ?ఏమో ..ఇప్పటికిప్పుడు ఔనని చెప్పలేకపోయినా కొన్ని సంకేతాలు కనిపిస్తున్నాయి.

ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి అరెస్ట్ అయినప్పుడు తొలిసారిగా గులాబీ సర్కార్ ఓ సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసిందన్న వాదన వినిపించింది.ఆ టైం లోహైదరాబాద్ లో వెలిసిన పోస్టర్లు ఇదే అంశాన్ని కాస్త బహిరంగపరిచాయి.తరువాత పార్టీ ఫిరాయింపులతో తెలంగాణాలో టీఆరెస్ దండయాత్ర మొదలు కావడంతో కులప్రస్తావన వెనకపడినట్టు అనిపించింది.మళ్లీ నయీమ్ కేసులో ఉమామాధవ రెడ్డి వ్యాఖ్యలు సామజిక వర్గం మీదే నడిచాయి.ఆమెకు మడ్దతుగా మాట్లాడిన రేవంత్ మాటల్లోనూ అదే భావన వ్యక్తమైంది.

మరో వైపు ప్రభుత్వ హనీమూన్ పీరియడ్ కూడా అయిపోయింది .కొన్ని సమస్యలపై ప్రజల నుంచి వ్యతిరేకత కనిపిస్తోంది .ఈ పరిస్థితిని అనువుగా మల్చుకోడానికి కాంగ్రెస్ వర్గాలు ప్రయత్నిస్తున్నాయి.ఆ పార్టీ నుంచి ఓ సామాజిక వర్గం దూకుడుగా వ్యవహరిస్తోందన్న అభిప్రాయం కన్పిస్తోంది.ఇక జేఏసీ చైర్మన్ కోదండరాం వ్యవహార శైలి ,అయన పట్ల ప్రభుత్వ వైఖరి మారుతున్న పరిస్థితులకు అద్దం పడుతుంది.ఇవన్నీ చూస్తుంటే పైకి కుల పోరులా అనిపిస్తోంది.

కాస్త నిశితంగా పరిశీలిస్తే ఓ విషయం అర్ధం అవుతుంది.ఇది కులపోరు కాదు ..ఆధిపత్య పోరు…తెలంగాణ సమాజం పై పట్టు కోసం సాగుతున్న పోరు..కేసీఆర్ కి అధికారంతో ,ఒకప్పుడు ఆధిపత్యం చెలాయించి పట్టు కోల్పోయిన ఓ వర్గం మళ్లీ పూర్తి స్థాయిలో క్రియాశీలమైంది .ఆ ప్రక్రియలో మరో ఆధిపత్య వర్గాన్ని ఢీకొంటోంది .ఇప్పుడు కనిపిస్తున్నది శాంపిల్ మాత్రమే..మున్ముందు ఈ పోరు తీవ్రం అవుతుంది..ఆధిపత్య పోరు కుల రూపంలో కనిపిస్తుందంతే ..

SHARE