Posted [relativedate]
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ 15 సంవత్సరాల తర్వాత తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి వెళుతున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కలను నెరవేర్చినందుకు మొక్కు తీర్చుకోవడానికి తిరుమల వెళ్తున్నట్టుగా సమాచారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున దాదాపు రూ. 5 కోట్ల విలువైన ఆభరణాలను కానుకగా సమర్పించనున్నారు. ఆయనతో పాటు కుటుంబ సభ్యులు కూడా తిరుమలకు వెళుతున్నారు. 2001లో కేసీఆర్ తిరుమలకు వెళ్లారు. ఇదే సమయంలో ఆయన కుటుంబ సభ్యులు మాత్రం పలుమార్లు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తరువాత ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమం జరిగిన తర్వాత తొలిసారి కేసీఆర్ ఏపీలో అడుగుపెట్టబోతున్నారు. ఏపీ రాజధాని శంకుస్థాపనకు కేసీఆర్ హాజరయ్యారు కూడా ..