కేసీఆర్ ని టార్గెట్ చేసిన కాంగ్రెస్ ..

   telangana congress politician fair kcrతెలంగాణ ప్రాజెక్టులపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై టి కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు.. నోరు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని హితవు పలికారు. తనపై ఆరోపణలు చేస్తే కేసీఆర్ జైలుకు పంపుతానంటున్నారని, అయితే నాపై కేసులు పెట్టు…జైలుకు వెళ్ళడానికి సిద్దంగా ఉన్నానని కాంగ్రెస్ నేత వీహెచ్‌ అన్నారు. భవిష్యత్తులో జైలుకెళ్లే అవసరం కేసీఆర్‌కే వస్తుందని వ్యాఖ్యానించారు. ప్రాణహిత చేవెళ్లకు జాతీయ హోదా కోసం గతంలో లేఖలు రాయలేదా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ తెలంగాణ ఇవ్వకపోతే కేసీఆర్‌కు దరిద్రం పట్టేదని… అలాంటిది కాంగ్రెస్‌ను దరిద్ర పార్టీ అంటారా? అని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కేసీఆర్‌ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని హెచ్చరించారు.

కేటీఆర్ ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారని వీహెచ్ మండిపడ్డారు.టీఆర్‌ఎస్‌ రాబందుల పార్టీ…టీఆర్‌ఎస్‌ నేతలు చదువురాని మూర్ఖులని కాంగ్రెస్ నేత మధుయాష్కి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కేసీఆర్ సవాల్ చేసి పారిపోవడం కాదు…మగాడైతే నిలబడాలని వ్యాఖ్యానించారు. కేసులు పెడతామన్న కేసీఆర్ బెదిరింపులకు భయపడేది లేదని స్పష్టం చేశారు. కేసీఆర్ సోయి వుండి మాట్లాడుతున్నారా? తాగి మాట్లాడుతున్నారా? అని ప్రశ్నించారు. మహారాష్ట్ర అక్రమ ప్రాజెక్టులపై కేసీఆర్‌ ఎందుకు ప్రశ్నించరన్నారు.

తాను చేసిన ఆరోపణలకు కట్టుబడి వున్నా…కేసులు పెడతారా..? అన్న మధుయాష్కి ధైర్యం ఉంటే సీబీఐతో విచారణ చేయించండని సవాల్ విసిరారు. కేసీఆర్ కుటుంబం, బంధువుల అవినీతిపై పోరాడుతామన్నారు. రావుల కాలంలో తెలంగాణాకు ఏమీ రావని మధుయాష్కి అన్నారు.లంగాణ సీఎం కేసీఆర్‌కు ఓపిక లేకపోతే రాజకీయాలు వదిలి పెట్టాలని కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి హితవు పలికారు.

ఆయనిక్కడ విలేకరులతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ సన్నాసులు అని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. అసహనంతోనే కేసీఆర్ తిట్ల పురాణం అందుకున్నారన్నారు. సీఎం వ్యాఖ్యల కారణంగానే శాంతి భద్రతల సమస్య తలెత్తే ప్రమాదం ఉందన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించటం ప్రతిపక్షాల ప్రాధమిక హక్కు అని తెలిపారు. ప్రాణహిత-చేవేళ్ల ప్రాజెక్టుపై కాంగ్రెస్ రూ.9 వేల కోట్లు ఖర్చు పెట్టిందని చెప్పారు.
పెద్దమ్మ గుడికి రండి..టీడీపీ

తెలంగాణలో కేసీఆర్ పాలన అంతా అవినీతిమయం అని టీటీడీపీ నేత వంటేరు ప్రతాప్‌రెడ్డి విమర్శించారు. కేసీఆర్‌ కుటుంబం, బంధువులు రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని ఆరోపించారు. తన పాలనలో అవినీతి లేదని పెద్దమ్మ గుడి వద్ద ప్రమాణం చేయాలని డిమాండ్ చేశారు. ఆదివారం పెద్దమ్మ గుడికి వస్తా…టీఆర్ఎస్ పెద్దలు రావాలని సవాల్ విసిరారు. ఎస్ఐ రామకృష్ణారెడ్డి ఆత్మహత్యకు అవినీతి కారణం కాదా? అని వంటేరు ప్రశ్నించారు.

SHARE