ఆరోగ్యశ్రీ కి ముందు అక్కడికెళ్ళాలి ..

0
499

 telangana employees health cardsప్రభుత్వ ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణకు ప్రత్యేక వ్యవస్థను నెలకొల్పాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. 2014 లో ప్రారంభించిన ఎంప్లాయీస్ హెల్త్ స్కీం ఇప్పటి వరకూ ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్‌ ట్రస్టు ఆధ్వర్యంలో నడుస్తోంది.. ఇందులో ఎదురవుతున్న సమస్యలను దృష్టిలో పెట్టుకొని ఆరోగ్యశ్రీ పరిధి నుంచి ఈహెచ్‌ఎస్‌ను తప్పించాలని ప్రభుత్వం భావిస్తోంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఆరోగ్య పథకం లాగే రాష్ట్ర ప్రబుత్వ ఉద్యోగులకు కూడా హెల్త్ స్కీం కు ప్రత్యేక వ్యవస్థను రూపొందించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.

ఈహెచ్‌ఎస్‌ కోసం ప్రత్యేకంగా జిల్లా, డివిజన్‌ స్థాయి ల్లో ఓపీ క్లినిక్‌లు నిర్వహించాలని నిర్ణయించారు.ఈ అంశం పై ఇప్పటికే తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అన్ని విభాగాల అదికారులతో సమావేశాన్ని నిర్వహించి ముఖ్యమంత్రికి సమాచారాన్నిందిచినట్టు అదికారులు తెలిపారు.ఈ వ్యవహారాలన్నింటినీ పర్యవేక్షించడానికి ప్రత్యేకంగా ముఖ్య కార్యనిర్వహణాధికారిని కూడా నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. త్వరలోనే దీనికి సంబంధించిన మార్గదర్శకాలు విడుదల చేయనుంది.

కొత్తగా చేసే మార్పుల్లో ప్రదానంగా సీజీహెచ్‌ఎస్‌ మాదిరిగా ముందుగా గుర్తింపు పొందిన ఈహెచ్‌ఎస్‌ క్లినిక్‌లలో వైద్యున్ని సంప్రదించాల్సి ఉంటుంది. ఇందుకోసం ప్రభుత్వ ఆసుపత్రులు, వైద్యులతో సంబంధం లేకుండా… ఈ క్లినిక్‌లను నిర్వహించడానికి విడిగా ఒప్పంద పద్ధతుల్లో వైద్యులు, పారామెడికల్‌ సిబ్బందిని నియమిస్తారు. అయితే ప్రస్తుతం ఉన్న విధానంలో అయితే ఈహెచ్‌ఎస్‌ కార్డు కేవలం ఆరోగ్యశ్రీ ట్రస్టుతో అనుసంధానమున్న ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందొచ్చు.

ఈ కొత్త విదానం వల్ల ఈ సమస్యలు తొలిగిపోయే అవకాశముందని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి.ప్రభుత్వ కార్పొరేట్‌ ప్రైవేటు ఆసుపత్రుల్లో మెరుగైన చికిత్స పొందాలనుకునే ఉద్యోగులు, పింఛనుదారులు… ముందుగా ఈహెచ్‌ఎస్‌ ఓపీ క్లినిక్‌లలో సంప్రదించి, వారి రెపరెన్స్ మేరకే వెళ్లాల్సి ఉంటుంది. ఒకవేళ అత్యవసర పరిస్థితుల్లో కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో చికిత్స పొందాల్సి వస్తే హాస్పెటల్లో చేరిన 24 గంటల్లోపు ఈహెచ్‌ఎస్‌ ఓపీ క్లినిక్‌ నుంచి అనుమతి పత్రాన్ని తీసుకురావాల్సి ఉంటుంది.ప్రభుత్వ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులతో పాటు పింఛనుదారులు, పాత్రికేయులు ఈ పథకం కింద లబ్ధిపొందుతారని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది.

Leave a Reply