శశికళకు తెలంగాణ ప్ర‌భుత్వం నోటీసులు!!

0
244
telangana government notice to seshiala

Posted [relativedate]

telangana government notice to seshiala
శ‌శిక‌ళ‌కు తెలంగాణ ప్ర‌భుత్వం నోటీసులివ్వ‌డ‌మేంట‌ని అనుకుంటున్నారా…? ఇది నిజ‌మే. అయినా తెలంగాణ ప్ర‌భుత్వానికి చిన్న‌మ్మ‌కు ఏంటి సంబంధం అనుకుంటున్నారా… ? ఉంది. అది ఏంటంటే శ‌శికి హైద‌రాబాద్ ఓ ఇల్లు ఉంది. ఆ ఇల్లే ఇప్పుడు నోటీసుల‌కు కార‌ణ‌మైంది.

సికింద్రాబాద్ ప‌రిధిలోని మారేడ్ ప‌ల్లి రాధిక కాల‌నీలో శ‌శిక‌ళ పేరిట ఒక ఇల్లు ఉంది. 1990 లో ఆ ఇల్లును కొనుగోలు చేసింది. అప్ప‌ట్లో జ‌య‌ల‌లిత హైద‌రాబాద్ కు ఎప్పుడు వ‌చ్చినా ఇదే ఇంట్లో ఉండేవారని టాక్. అంతేకాకుండా చిన్న‌మ్మ కుటుంబ‌స‌భ్యులు కూడా భాగ్య‌న‌గ‌ర విహారానికి వ‌చ్చిన‌ప్పుడు ఇక్క‌డే బ‌స చేసేవార‌ట‌. అయితే గ‌త ఐదారేళ్లుగా జ‌య‌ల‌లిత బిజీ అయిపోవ‌డంతో.. చిన్న‌మ్మ కూడా హైద‌రాబాద్ లోని ఇంటిపై దృష్టి పెట్ట‌లేదు. మ‌ధ్య‌లో కొంత‌కాలం ఇంటిని అద్దెకిచ్చినా.. త‌ర్వాత వారు కూడా ఖాళీ చేసి వెళ్లిపోయారు. రెండేళ్ల కింద శ‌శిక‌ళ కుటుంబ‌స‌భ్యులు వ‌చ్చి రంగులు వేయించార‌ట‌. కానీ త‌ర్వాత ఏం జ‌రిగిందో.. రెండేళ్ల నుంచి ఇల్లు ఖాళీగా ఉంద‌ని టాక్.

ఎవ‌రూ ప‌ట్టించుకోక‌పోవ‌డంతో ఈ ఇంటికి సంబంధించిన ఆస్తి ప‌న్ను కూడా పెండింగ్ లో ఉండిపోయింది. ఒక‌టి రెండు సార్లు తెలంగాణ ప్ర‌భుత్వం నోటీసులు పంపినా ..చిన్న‌మ్మ ప‌ని ఒత్తిడిలో మర్చిపోయారట‌. కానీ ఈమ‌ధ్య మ‌రోసారి టీ-స‌ర్కార్ నోటీసులు పంపింది. ఆ నోటీసులు కూడా క‌రెక్ట్ గా చిన్న‌మ్మ జైలుకెళ్లే త‌రుణంలో అందాయ‌ట‌. దీంతో అస‌లే అస‌హ‌నంలో ఉన్న శ‌శిక‌ళ‌… ఆ నోటీసుల‌ను చూసి మ‌రింత ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింద‌ని టాక్.

Leave a Reply