తెలంగాణలోనూ కృష్ణమ్మ పండుగకు సర్వం సిద్ధం ..

0
432

  telangana krishna pushkara works finished ready start

రేపటి నుంచి ప్రారంభం కానున్న కృష్ణవేణి పుష్కరాల తెలంగాణ ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది. తెలంగాణలోని మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాల గుండా పారుతున్న కృష్ణానదిలో పుష్కర పుణ్యస్నానాలు ఆచరించేందుకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలుగ కుండా ఏర్పాట్లు చేశారు. కృష్ణా పుష్కరాలకు మహ బూబ్‌నగర్, నల్గొండ పుష్కఘాట్ల కు వచ్చే వచ్చే లక్షలాది మంది భక్తులుకు భారీ ఏర్పాట్లు చేసింది.

తెలంగాణ నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి పుష్కర స్నానాలు ఆచరించేందుకు వచ్చే భక్తులకు ఘాట్ల సమాచారం, రైళ్లు, ప్రత్యేక బస్సుల సమాచారాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. మహ బూబ్‌నగర్ జిల్లాలో 52, నల్గొండలో 29 ఘాట్లను ఏర్పాటు చేశారు. ఘాట్ల వద్దకు వచ్చే భక్తులు నదిలోకి వెళ్లి స్నానాలు ఆచరించేందుకు ప్రత్యేకంగా భారీకేడ్లు సహితం ఏర్పాటు చేశారు. పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశంతో దేవాదాయ, ధర్మాదాయశాఖతో పాటు గ్రామీణ తాగునీటి, పారిశుద్ధ్యంశాఖ, పంచాయితీరాజ్, పోలీసు, రెవెన్యూశాఖల అధికారులు పుష్కరఘాట్ల వద్ద భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు.

పుష్కరాల సందర్భంగా సమీపంలోని చిన్నా, పెద్ద దేవాలయాలను సుందరంగా తీర్చిదిద్దారు.పుష్కరఘాట్లు, దేవాలయాలవద్ద రూ.5కోట్లు వెచ్చించి భారికేడ్లు, క్యూలైన్లు, ధీపాలను దేవాదాయశాఖ ఏర్పాటు చేసింది. అలాగే పుష్కర ఘాట్ల వద్ద ఆర్‌డబ్ల్యూఎస్‌శాఖ భక్తుల కోసం మరుగుదొడ్లను నిర్మించింది. అలాగే మహిళలు డ్రెస్‌లు మార్చుకునేందుకు ప్రత్యేకంగా గదులను నిర్మించారు. గత ఏడాదిలో గోదావరి పుష్కరాల సందర్భంగా తలెత్తిన ఇబ్బందులు కృష్ణానది పుష్కరాలలో తలెత్తకుండా జాగ్రత్తగా ఏర్పాట్లు చేశారు. పుష్కరాలకు భారీ ఎత్తున తరలివచ్చే భక్తులకు పోలీసులు భారీ ఎత్తున బందోబస్తు ఏర్పాట్లు చేశారు. కృష్ణానది పరివాహక ప్రాంతాలతో పాటు రహదారుల వెంబడి ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ముందు జాగ్రత్తగా చర్యలు చేపట్టారు. కొన్ని పుష్కరఘాట్ల వద్ద రద్దీ ఎక్కువ ఉంటే రద్దీలేని ఘాట్లకు భక్తులను మళ్లించేందుకు ఏర్పాట్లు సహితం చేశారు. పుష్కరఘాట్ల వద్ద పిండప్రధానం చేసేందుకు అర్చకులు, పిండసామాగ్రి ధరలను నియంత్రించేందుకు స్థానిక పోలీసు, రెవెన్యూశాఖ అధికారులు చర్యలు తీసుకోనున్నారు.

ముఖ్యంగా వీఐపీ ఘాట్ల వద్దకు వచ్చే వీఐపీలకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. వీఐపీ ఘాట్ల వద్ద పోలీసు బలగాలను మోహరించారు. మహబూబ్‌నగర్ జాతీయ రహదారి, అలాగే రాయిచూర్ రహదారిపై ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురుకాకుండా పోలీసులను ఏర్పాటు చేస్తున్నారు. పుష్కరాల సందర్భంగా జోగులాంబ, సోమశీల, బీచుపల్లికి భక్తులు భారీ ఎత్తున తరలివస్తారని గుర్తించిన అధికారులు రెండు దేవాలయాల వద్ద భారీ ఏర్పాట్లు చేశారు.

గేట్ల వద్ద ప్రత్యేక చర్యలు….పుష్కరాలకువెళ్లే భక్తుల వాహనాలను త్వరగా పంపించేందుకు టోల్‌గేట్ల వద్ద ప్రత్యేకంగా వాహనాల లైన్లను ఏర్పాటు చేశారు. టోల్‌గేట్ల వద్ద వాహనాలను ఎక్కువసేపు నిలువకుండా ఉండేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆయా జిల్లాల కలెక్టర్లు ఆదేశించడంతో వారు ప్రత్యేక లైన్లనుఏర్పాటు చేశారు. అలాగే సర్కార్ వాహనాలు, ప్రజాప్రతినిధులు, వీఐపీలు వెళేలదుకు ప్రత్యేక దారులను ఏర్పాటు చేశారు.

Leave a Reply