మహాఒప్పందంపై సొంత కవిత్వం లేదు..

  telangana maharashtra big deal irrigation project opposition parties fair kcr
తెలంగాణ,మహారాష్ట్ర మధ్య నీటి ప్రాజెక్ట్ లకి సంబంధించి కుదిరిన ఒప్పందంపై విపక్షాలు దూకుడుగా విమర్శనాస్త్రాలు సంధిస్తున్నాయి.ఎయిర్ పోర్ట్ నుంచే కేసీఆర్ విసిరిన సవాల్ కి పీసీసీ అధ్యక్షుడు ఉత్తమకుమార్ రెడ్డి ,తెలుగు దేశం ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి ధీటుగా సమాధానమిచ్చారు.సవాళ్లు,ప్రతిసవాళ్లు వాతావరణాన్ని వేడెక్కించాయి.మామూలు వాతావరణం లోనే కాస్త మేటర్ దొరికితే చీల్చి చెండాడి సునామి సృష్టించే మీడియా మాత్రం ఈసారి వార్తని వార్తగా ఇచ్చి వూరుకున్నాయి.

కొన్ని చానళ్లు మరో అడుగు ముందుకేసి ఒప్పంద ప్రయోజనాలను ఏకరువు పెట్టే ప్రయత్నం చేశాయి.అయితే ఏ మీడియా కూడా జరిగిన ఒప్పందాన్ని విమర్శనాత్మక దృష్టితో చూపలేకపోయాయి.ఒప్పంద లాభనష్టాల్ని బేరీజు వేసుకుందామనుకున్న వాళ్లకి రెండో కోణానికి సంబంధించిన సమాచారం పెద్దగా దొరకడంలేదు.ప్రతిపక్షాల వాదన మాత్రమే బయటికి వస్తోంది.ఇదంతా చూసిన ఓ పెద్దాయన ఈ వ్యవహారంలో మీడియా సొంతకవిత్వం ఏమైందని ఎద్దేవా చేశారు .అంతటితో ఆగకుండా శెభాష్ కేసీఆర్ అన్నారు.

SHARE