ఆంధ్ర,తెలంగాణ మధ్య మరో వివాదం…

0
500

 telangana sarkar dismissed ap secretariat employeesఏపి-తెలంగాణ ఉద్యోగల విభ‌జ‌న‌లో మ‌రో వివాదం రాజుకుంది. ఉద్యోగుల విభజనకు మరి కొన్ని రోజుల్లోనే శుభం కార్డు పడుతున్న త‌రుణంలో తెలంగాణ సచివాలయంలో విధులు నిర్వ‌హిస్తున్న‌ 41 మంది ఏపికి చెందిన‌ సెక్షన్ ఆఫీసర్లను..టీ-సర్కార్ రిలీవ్ చేయడంపై కలకలం రేగుతోంది. ఈ ఘటనను గిల్లికజ్జాలా చర్యగా, ఏపి స‌చివాల‌య‌ ఉద్యోగ సంఘాల నేత‌లు మండిపడుతున్నారు…తెలంగాణ స‌ర్కార్ తీరుపై కేంద్రానికి ఫిర్యాదు చేస్తామంటున్నారు…

రెండు తెలుగు రాష్ట్రాలు విడిపోయి రెండుళ్లు దాటుతున్నా ఇంకా వివాదాలు రేగుతూనే ఉన్నాయి..ఇప్ప‌టికే రెండు రాస్ట్రాల మ‌ధ్య నీటి వివాదాలు ఉండ‌గానే ఇప్పుడు ఉద్యోగుల విభ‌జ‌న‌లో మ‌రో స‌మ‌స్య‌ల త‌లెత్తింది…ఇరు రాష్ట్రాల్లో ఉద్యోగుల కేటాయింపు ముగింపు దశకు చేరుకున్న స‌మ‌యంలో ఏపీకి చందిన‌ 41 మంది సెక్షన్ ఆఫీసర్లను..టీ-సర్కార్ రిలీవ్ చేసింది.. దీనిపై ఏపీ ఉద్యోగుల్లో కలకలం రేగుతోంది. సచివాలయ ఉద్యోగుల విభజనలో భాగంగా, అధికంగా ఉన్న 78 మంది ఏపి ఉద్యోగులను..కమల్ నాధన్ కమిటీ, తెలంగాణ కు కేటాయించింది.

అంతకు ముందు కేటాయింపుల్లో భాగంగా కొందరు తెలంగాణ సెక్షన్ ఆఫీసర్లు ఏపి కి వెళ్లాల్సి వచ్చింది. అయితే, ఏపి కి వెళ్లిన 41 మంది తెలంగాణ ఉద్యోగులు..తిరిగి తాము సొంత రాష్ట్రానికి వెళ్తామని, కమల్ నాధన్ కమిటీకి ఆప్షన్స్ ఇచ్చారు. ఈ సమయంలోనే, తెలంగాణ లో పనిచేస్తోన్న 41 మంది ఏపి ఉద్యోగులు..తిరిగి తాము ఏపికి వెళ్లిపోతామని.. క‌మ‌ల నాథ‌న్ క‌మిటీకి ఆప్షన్స్ ఇచ్చారు. ఈ నేప‌థ్యంలో 41 మంది సెక్షన్ ఆఫీసర్లను ఈ నెల 12 న రిలీవ్ చేస్తూ, తెలంగాణ సర్కార్ ఆదేశాలు ఇచ్చింది.

ఏపీకి చెందిన 41 మంది సెక్షన్ ఆఫీసర్ల రిలీవ్ విష‌యంలో ఎవరితో సంప్రదించకుండా.. ఏకపక్షంగా తెలంగాణ సర్కార్ రిలీవ్ చేయడంపై..ఏపి ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి. కమ‌ల‌నాథ‌న్ క‌మిటీ తుది కేటాయింపులు జరిగే వరకు రెండు ప్ర‌భుత్వాలు కూడా ఉద్యోగులను రిలీవ్ చేయారాదన్న ఒప్పందాన్ని..తెలంగాణ ప్రభుత్వం ఉల్లంఘించిందని.. ఏపీ స‌చివాల‌య‌ ఉద్యోగుల సంఘం నేత‌లు ఆరోపిస్తున్నారు.. మరో 15 రోజుల్లో సామరస్యంగా ఉద్యోగుల కేటాయింపులు పూర్తయ్యే అవకాశం ఉన్నా, గిల్లి కజ్జాల కోసమే.. తెలంగాణ ప్రభుత్వం లోని కొందరు ఉన్నతాధికార్లు, ఇలాంఇ ఘటనల‌కు పాల్పడుతున్నార‌ని మండిప‌డుతున్నారు…దీనిపై కేంద్రానికి, కమల్ నాధన్ కమిటీకి ఫిర్యాదు చేస్తామని వారు చెబుతున్నారు…

మొత్తంగా మీద‌, ఉద్యోగుల విభజన సామరస్యంగా ముగుస్తుందని భావిస్తోన్న సమయంలో..41 మంది సెక్షన్ ఆఫీసర్ల రిలీవింగ్ ఆదేశాలు..ఇరు రాష్ట్రాల ఉద్యోగ సంఘాల్లో వేడిని రాజేసినట్లేనని, సచివాలయ వర్గాలంటున్నాయి.

Leave a Reply