Posted [relativedate]
సోగ్గాళ్లే చిన్ని నాయనా అన్న శీర్షికతో తెలంగాణ సచివాలయంలో కొందరు ఐఏఎస్ ల పొందు భాగోతాన్ని కవర్ చేసిన ఆంధ్రజ్యోతి బ్యానర్ వార్త సంచలనం సృష్టిస్తోంది.ఈ తెల్లవారుజామునే పేపర్ బయటికి రాగానే చాలా మంది ఐఏఎస్ ల సెల్ ఫోన్ లు గణగణ మోగాయి.అందులో భాగమైన వాళ్ళు తెలిసిన జర్నలిస్ట్ లకి ఫోన్ చేసి జ్యోతి దగ్గర దీనికి సంబందించిన ఫోటోలు,వీడియోలు వుండే అవకాశం ఎంతవరకని ఆరాలు తీయడం ప్రారంభించారు.ఇవాళ్టి కథనానికి కొనసాగింపుగా పేర్లు బయటపెట్టే అవకాశం ఉందేమో అన్న భయం వారిని వెంటాడుతోంది.
ఇదంతా ఒక ఎత్తు అయితే సొంత భార్యలే ఆ రసిక ఐఏఎస్ లు ఎవరని అడుగుతుంటే జవాబు చెప్పలేక….తొట్రుపాటు కనపడకుండా ఉండేందుకు అయ్యగార్లు పడ్డ పాట్లు అన్ని ఇన్ని కావు.ఇక కాస్త చనువు ఉన్న సాటి ఐఏఎస్ లు ఇకనైనా జాగ్రత్తగా ఉండమని చెప్తుంటే బిక్క మొహం వేసుకుని చూడటం మినహా నో రియాక్షన్ అంట.ఏదేమైనా బాస్ లు గా వ్యవహరించడం మాత్రమే తెలిసిన వాళ్లకి ఒక్కసారి పరువుమర్యాదల విలువ గుర్తొచ్చింది.