అధికారికంగా కొత్త జిల్లాల పక్రియ..

0
466

  telangana state  new districts mandalతెలంగాణ రాష్ట్రంలో కొత్త జిల్లాల పునర్వ్యవస్థీకరణ నోటిఫికేషన్‌కు విడుదల చేశారు. 27 జిల్లాలకు సంబంధించి నోటిఫికేషన్‌కు మంత్రివర్గ ఉపసంఘంతోపాటు అఖిలపక్ష సమావేశం, కేబినెట్‌ భేటీ ఆమోదం లభించచింది. 27 జిల్లాలు, మండలాలు, డివిజన్ల ఏర్పాటుకు అనుగుణంగా భూపరిపాలన ప్రధాన కమిషనర్‌ (సీసీఎల్‌ఏ) జె.రేమండ్‌ పీటర్‌ ప్రతిపాదనలుకు సీఎం నిన్న ఆమోదం తెలిపారు. జాబితాను కాసేపు నిశితంగా పరిశీలించిన సీఎం.. మండలాలు, గ్రామాలపై స్వల్ప మార్పులు సూచించారు. సీసీఎల్‌ఏ నివేదిక ఆధారంగా జిల్లాల ప్రాథమిక నోటిఫికేషన్‌కు రిలీజ్ చేసింది. సోమవారం నోటిఫికేషన్‌ విడుదల కానుంది. రాష్ట్రంలో ప్రస్తుతం 459 మండలాలు ఉండగా.. కొత్తగా 33 మండలాలను రానున్నాయి. 44 రెవెన్యూ డివిజన్లకు కొత్తగా 14 డివిజన్లను చేర్చారు. జిల్లాలకు ప్రాథమిక నోటిఫికేషన్‌ విడుదల అనంతరం నాలుగు అంచెల్లో అభ్యంతరాలు, అభిప్రాయాలను స్వీకరించనున్నారు.

ఇందుకు ప్రత్యేకంగా వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. ప్రజలెవరైనా ఆన్‌లైన్‌లోనే నేరుగా అభిప్రాయాలను పొందుపరచవచ్చు. నాలుగు అంచెల్లో తహసీల్దార్‌, రెవెన్యూ డివిజనల్‌ కార్యాలయం, కలెక్టరేట్‌తోపాటు రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కార్యాలయంలోనూ విజ్ఞప్తులను స్వీకరిస్తారు. ఆ తర్వాత వీటిని మన్నించారా.. తిరస్కరించారా అనే విషయాన్ని కూడా ప్రజలకు వివరిస్తారు. సెప్టెంబరు 20వ తేదీ దాకా అభ్యంతరాల స్వీకరణ చేపట్టి… ఆ తర్వాత 15 రోజుల పాటు వీటిని పరిశీలించి.. అక్టోబరు రెండోవారంలో తుది నోటిఫికేషన్‌ విడుదల చేస్తారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణకు సంబంధించి సెప్టెంబర్‌ నెలలో మరో రెండుసార్లు అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సెప్టెంబరు 5వ, 20వ తేదీల్లో వీటిని నిర్వహించనున్నారు.

కొత్త మండలాలు
మావల (ఆదిలాబాద్‌), హాజీపూర్‌, నస్‌పూర్‌, పెంచికల్‌పేట్‌ (కొమురం భీం), సోన్‌ (రాంజీగోండు నిర్మల్‌), ఖిలా వరంగల్‌ (వరంగల్‌), కాజీపేట్‌ (హన్మకొండ), మహబూబ్‌నగర్‌ రూరల్‌ (మహబూబ్‌నగర్‌), చిన్నంబావి, పదర (నాగర్‌ కర్నూలు), నందిన్నె, అమరచింత (వనపర్తి), హవేలీ ఘన్‌పూర్‌ (మెదక్‌), నాగల్‌గిద్ద, అమీన్‌పూర్‌, కంది, మొగుదాంపల్లి, సిర్గాపూర్‌ (సంగారెడ్డి), నారాయణరావుపేట (సిద్దిపేట), గట్టుప్పల్‌, మాడ్గులపల్లి, కొండ మల్లేపల్లి, నేరడిగొమ్ము (నల్లగొండ), నాగారం (సూర్యాపేట), మోటకొండూరు, అడ్డగూడూరు (యాదాద్రి). యూసు్‌ఫగూడ, కంచన్‌బాగ్‌, మెహిదీపట్నం (హైదరాబాద్‌), సరూర్‌నగర్‌ అర్బన్‌, బాలాపూర్‌ (శంషాబాద్‌), దుండిగల్‌, జవహర్‌నగర్‌ (మల్కాజ్‌గిరి).

కొత్త రెవెన్యూ డివిజన్లు
కీసర (రంగారెడ్డి), నారాయణఖేడ్‌, జహీరాబాద్‌ (సంగారెడ్డి), గజ్వేల్‌ (సిద్దిపేట), తూప్రాన్‌ (మెదక్‌), కోదాడ (సూర్యాపేట)), బెల్లంపల్లి (కొమరం భీం), ముదోల్‌ (నిర్మల్‌), బాన్సువాడ (కామారెడ్డి), హుజూరాబాద్‌ (హన్మకొండ), వైరా (ఖమ్మం), అచ్చంపేట (నాగర్‌ కర్నూలు), ఇబ్రహీంపట్నం (శంషాబాద్‌). కోరుట్ల (జగిత్యాల).

ప్రతిపాదిత జిల్లాలు మండలాలు
రాంజీగోండు నిర్మల్‌ 15
కొమురం భీం 25
కొత్తగూడెం 18
యాదాద్రి 20
సూర్యాపేట 20
నాగర్‌ కర్నూలు 21
వనపర్తి 20
హన్మకొండ 14
ఆచార్య జయశంకర్‌
భూపాలపల్లి 16
సిద్దిపేట 19
సంగారెడ్డి 27
కామారెడ్డి 16
పెద్దపల్లి 10
జగిత్యాల 16
మల్కాజ్‌గిరి 8
శంషాబాద్‌ 14
మహబూబాబాద్‌ 12
ఆదిలాబాద్‌ 17
మహబూబ్‌నగర్‌ 25
నల్లగొండ 31
హైదరాబాద్‌ 16
మెదక్‌ 15
కరీంనగర్‌ 18
ఖమ్మం 21
రంగారెడ్డి 19
వరంగల్‌ 14
నిజామాబాద్‌ 15

Leave a Reply