బెంగళూరు లో తెలుగు వ్యాపారవేత్త హత్య..

 Posted October 31, 2016

telugu business man murdered in bengaloore
పరుచూరి సురేంద్రనాథ్ …బెంగళూరు లో తెలుగు వ్యాపారవేత్త లందరికీ పరిచయమైన పేరు ,వ్యక్తి .వ్యాపార లావాదేవీల కారణంగానే అయన హత్యకి గురికావడం సంచలనం రేపుతోంది . పరుచూరి గ్లోబల్ ఫౌండేషన్ సామాజిక,సేవ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనే సురేంద్రనాధ్ ఏపీలోని గుంటూరు జిల్లాకి చెందినవారు .వ్యాపార రీత్యా 15 ఏళ్లుగా అయన బెంగళూర్ లోనే వుంటున్నారు. దీపావళి రోజు ఆఫీస్ నుంచి ఇంటికి వస్తుండగా అయన వాహనాన్ని ద్విచక్రవాహనాలతో చుట్టుముట్టిన దుండగులు కాల్పులకు దిగారు .అతి దగ్గరనుంచి ఆరు తూటాలు ఆయనకి తగిలాయి. తొలుత బాణాసంచా మోతలుగా స్థానికులు భావించారు .తర్వాత గాయపడ్డ సురేంద్రనాధ్ ని గుర్తించి ఆస్పత్రికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది .నిత్యం భద్రతా వలయం మధ్యన వుండే సురేంద్ర పండగ రోజు ఏమరుపాటుగా ఉండటమే ప్రాణాల మీదకి తెచ్చింది .మొత్తం కాల్పుల ఘటన ఓ ఇంటి ముందు ఏర్పాటు చేసిన సీసీ టీవీ లో రికార్డు అయింది .దాని ఆధారంగా పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు .

SHARE