ప్రయోగాలకు సిద్ధంగా లేనిది ప్రేక్షకులా.? హీరోలా.?

Posted January 21, 2017

telugu film stars not do concept movies because of audienceవిలక్షణ నటుడు అనగానే కమల్ హాసన్ అంటారు.సినిమా,సినిమాకి వైవిధ్యం చూపే నటుడు అమీర్ ఖాన్. జాతీయ అవార్డు సినిమాలంటే బెంగాలీ,మలయాళీ సినిమాలే.గత సంవత్సరం ‘బాహుబలి’కి వచ్చిన దాని మీద ఎన్నో విమర్శలు.మనకి హిట్ సినిమాలు ఎన్నో ఉన్నాయి కానీ మంచి అభిరుచి కలిగిన సినిమాలు మాత్రం చాలా తక్కువ.

ఒకటీ ,అరా వచ్చిన అవి ప్రేక్షక ఆదరణ పొందకపోవటం వల్ల హీరోలు అదే మూసలో వెళుతున్నారు. వీళ్ళు నటులుగా కంటే హీరోలుగా,స్టార్లుగా పిలిపించుకోవడానికే ఇష్ట పడుతున్నారు. కానీ ప్రేక్షకులు మాత్రం రొటీన్ కి భిన్నంగా వున్న చిత్రాలని చాలా వరకు ఆదరిస్తున్నారు.కధలో దమ్ము,కొత్తదనం ఉంటే సినిమాకు పట్టం కడుతున్నారు.ఉదాహరణకు ఈ మధ్య కాలం లో వచ్చిన ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ డిమానిటైజేషన్ లాంటి ప్రతికూల పరిస్థితి లోనూ,అది ధ్రువ లాంటి పెద్ద సినిమా పోటీలో ఉండగా కలెక్షన్లు సాధించింది.కారణం ప్రేక్షకులని కథ థ్రిల్ గా గురి చేయడమే.

దంగల్ సినిమా వసూళ్ల రికార్డులు తిరగరాస్తుంది.దానికి కధ,కథనాలే బలం.అమీర్ ఖాన్ అనే స్టార్ దాని విలువని మరింత పెంచాడు.అలా స్టార్లు నటులుగా మారితే కధ విలువ సినిమా విలువ మరీంత పెరుగుతుంది.కానీ మన దగ్గర హీరోలు ఇంకా పాత కాలపు ఫార్ములా వదలట్లేదు.ఇమేజ్ చట్రంలో బిగించబడిపోయి బయటకి రాలేకపోతున్నారు.సినిమా అభిమానులని అలరిస్తే చాలనుకుంటున్నారు.సామాన్య ప్రేక్షకుల గురించి వదిలేస్తున్నారు.అభిమానులకి నచ్చే ఫార్ములా కధలో రెడీ అయిపోతున్నారు.రెడీమేడ్ గా దొరికే రీమేక్ ల పై ఆసక్తి చూపిస్తున్నారు.

ఈ మధ్య ఒక ఇంటర్వ్యూ లో దంగల్ లాంటి సినిమా తెలుగులోకి వస్తుందా అని మెగాస్టార్ చిరంజీవి గారిని అడిగితే రాదు అనే సమాధానం ఇవ్వలేదు.వెంకటేష్ చేస్తున్న గురు అలాంటి సినిమానే.అలాంటి సినిమాలు తెలుగులో రావాలి అంటూ సమాధానం దాటవేశారు,అంతేకానీ వస్తుంది అంటూ ఖచ్చితమైన సమాధానం ఇవ్వలేదు.హీరోలే రిస్క్ తీసుకోవటానికి భయపడుతూ, వాళ్ళ కంఫర్ట్ జోన్ లో వాళ్ళుంటే ప్రేక్షకులని అలరించే సినిమాలు ఎలా వస్తాయి.

అమితాబ్ రీ ఎంట్రీ లో బ్లాక్,పా,పింక్ లాంటి సినిమాలతో తన స్టార్ డమ్ ని పక్కన పెట్టి తనలోని నటుడ్ని సంతృప్తి పరిచే పాత్రలు చేస్తున్నారు.ఆ ఒరవడి సౌత్ లో లేదు.కాకపోతే ఇప్పుడిప్పుడే నాగార్జున, వెంకటేష్ లాంటి సీనియర్ హీరోలు ఆ రకంగా ప్రయత్నిస్తున్నారు.వాటికి ప్రేక్షకాదరణ దక్కితే బహుశా మిగతా తెలుగు స్టార్లు కూడా ఆ వైపుగా ఆలోచిస్తారేమో .?

SHARE