అన్ని దేవాలయాలకు ఆదిత్య శక్తి..

temple solar energy

ఏపీలో టెంపుల్స్ కు సోలార్ ఎనర్జీ అందించేందుకు సర్కార్ వడి వడి అడుగులు వేస్తోంది. అందుబాటులో ఉన్న ఇంధన శక్తి, సామర్థ్యాలను సమర్థవంతంగా వినియోగంలోకి తేవడం ద్వారా పర్యావరణ పరిరక్షణతోపాటు ఖర్చును పొదుపు చేయగలుగుతామని దేవాదాయ శాఖ భావిస్తోంది. జగ్గయ్యపేటలో 50 కోట్ల రూపాయల వ్యయంతో సోలార్ పవర్ ప్రాజెక్ట్ యూనిట్‌ను చేపట్టనున్నట్లు తెలియజేశారు. పర్యావరణ పరిరక్షణ పనులలో భాగంగా చర్యలు చేపట్టే ఇంధన/శక్తి, సామర్థ్యాలను సమర్థవంతంగా వినియోగంలోకి తేవడానికి ప్రణాళికలు తయారు చేస్తున్నారు.

రాష్ట్రంలోని 7 ప్రధాన దేవాలయాలైన సింహాచలం, అన్నవరం, ద్వారకా తిరుమల, దుర్గామల్లేశ్వర, శ్రీశైలం, శ్రీకాళహస్తి, కాణిపాకం ఆలయాలలో విద్యుత్ వినియోగం తదితర శక్తి సామర్థ్యాలపై ఆడిట్‌ను చేపట్టారు విద్యుత్ వినియోగంలో సోలార్ ఎనర్జీని ప్రవేశపెట్టడంతోపాటు ప్రస్తుత విద్యుత్ సరఫరా వౌలిక వసతులు, ట్రాన్స్‌ఫార్మర్‌లు, ఎసిలు, విద్యుత్ మోటార్లు, అన్న, ప్రసాదాలు తయారు చేసే చోటు, స్విచ్ బోర్డు నిర్వహణ , సత్రాలలో వినియోగించే ఎలక్ట్రికల్ హీటర్లు తదితర పరికరాలపై పూర్తి స్థాయిలో నివేదికను రూపొందించుకోవడం జరిగిందన్నారు.

ఉత్పాదన, వినియోగంలో పొదుపు వంటి అంశాల ద్వారా ఎంత వినియోగం అవుతోంది, ఎంత పొదుపు చేయగలుగుతామో వంటి అంశాలపై సాంకేతిక విశే్లషణను చేపట్టామ న్నారు. కాపర్ వైరింగ్, సమర్థవంతమైన ట్రాన్స్‌ఫార్మర్‌ల ఏర్పాటుతో సోలార్ వాటర్ హీటింగ్ విధానాన్ని ప్రత్యామ్నాయంగా ఏర్పాటుపై దృష్టి సారిస్తున్నారు. సత్రాలలో సోలార్ ఎనర్జీని వినియోగించడంపై దృష్టి సారించి రూఫ్‌టాప్ సోలార్ యూనిట్లను ఏర్పాటు చేయడం ద్వారా కట్టెలు, గ్యాస్ వినియోగాన్ని తగ్గించడంపై దృష్టిపెట్టారు. ఫైవ్ స్టార్ రేటింగ్ గల విద్యుత్ ఉపకరణాలను వినియోగించడంతోపాటు ఎల్‌ఇడి బల్బుల వాడకాన్ని ఆలయాలలో పెంచనున్నారు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here