టెన్ జన్ పథ్ ఛాయస్ ఉత్తమ్ ..ఇక నో డౌట్

0
555
tenjhan padh choice uttam no doubt

Posted [relativedate]

tenjhan padh choice uttam no doubtఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ కు జోడెద్దులుగా గుర్తింపు పొందారు వైఎస్, డీఎస్. ఈ జోడీ ఆధ్వర్యంలో భారీగా ఎంపీసీట్లు గెలవడంతో పాటు వరుసగా రెండుసార్లు పార్టీ అధికారంలోకి రావడంతో.. వీరికి ఆ పేరు స్థిరపడిపోయింది. ఇప్పుడు మళ్లీ విభజన తర్వాత తెలంగాణలో జోడెద్దులుగా పేరు తెచ్చుకుంటున్నారు ఉత్తమ్, భట్టి. సీనియర్ల నుంచి సహకారం లేకపోయినా, అనుభవం తక్కువైనా తమ వంతుగా బాగానే దూకుడు చూపిస్తున్నారు. మూడు దశాబ్దాలు మంత్రి పదవి వెలగబెట్టిన జాా కంటే ఉత్తమ్, భట్టి వెయ్యిరెట్లు మెరుగనే సంగతి ఢిల్లీ నేతలకు కూడా అర్థమైపోయింది. అందుకే వీరిద్దరినీ మార్చాలని ఎవరు చెప్పినా వినడం లేదట సోనియా.
మొన్నటికి మొన్న హైదరాబాద్ లో జరిగిన సీనియర్ల భేటీలో కూడా ఉత్తమ్ ను వెనకేసుకొచ్చారు అధిష్ఠానం దూత కుంతియా. ఉత్తమ్ పై అవాకులు, చెవాకులు మాట్లాడొద్దని, పీసీసీ చీఫ్ ఎవరైతే వాళ్లే బాహుబలి అని గుర్తుపెట్టుకోవాలని గట్టిగానే చెప్పారు. దాంతో అసంతృప్తుల నోళ్లు మూతపడ్డాయి. ఎంతసేపూ పీసీసీ చీఫ్ జిల్లాల్లో తిరగడం లేదనే ఫిర్యాదులే కానీ.. అసలు మీరేం వెలగబెడుతున్నారో స్వీయ పరిశీలన చేసుకున్నారా అన్న అధిష్ఠానం ప్రశ్నకు వీరిదగ్గర సమాధానం లేదు. భట్టి కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ గా తన బాధ్యతలు నిర్వహిస్తూనే.. ఉత్తమ్ కు మంచి సపోర్ట్ ఇస్తున్నారనేది ఢిల్లీ పరిశీలనలో తేలిన నిజం.
అందుకే 2019 ఎన్నికలు భట్టి, ఉత్తమ్ ఆధ్వర్యంలోనే జరుగుతాయని, మెంటల్ గా ప్రిపేరైపోవాలని కుంతియా కాంగ్రెస్ నేతలకు హెచ్చరికలు జారీ చేశారు. ఇక ఇప్పుడు అసలు బాధ్యత ఈ జోడీపై పడింది. ఇప్పటిదాకా అసెంబ్లీ లోపలా, బయట చక్కటి సమన్వయంతో వ్యవహరిస్తున్న ఉత్తమ్, భట్టి జంట.. కాస్త సరైన ప్లాన్ వేసుకుంటే టీఆర్ఎస్ కు ఇబ్బందులు సృష్టించడం కష్టం కాదనే మాట వినిపిస్తోంది. సీనియర్లను కవ్వించడం ఎందుకనే జిల్లాలకు వెళ్లడం లేదు కానీ.. పర్యటించడానికి ఇబ్బందేమీ లేదని ఉత్తమ్ కూడా సన్నిహితుల దగ్గర చెప్పారట. సో ఇక తెలంగాణ కాంగ్రెస్ స్పీడ్ పెరగడం ఖాయం. ఉన్నట్లుండి కాంగ్రెస్ యాక్టివ్ కావడంతో.. టీఆర్ఎస్ కు జానారెడ్డి భుజాలపై తుపాకీ పెట్టి కాల్చే అవకాశం లేదని అర్థమైపోతోంది.

Leave a Reply