బీజేపీకి టీజీ సవాల్ ..విశాఖ డయాస్

  tg venkatesh fires bjp politician vizag
ప్రత్యేక హోదా అంశంలో బీజేపీ మీద ఒత్తిడి తేవడానికి అందివచ్చిన ప్రతి అవకాశాన్ని వాడుకుంటున్నారు తెలుగుదేశం నేతలు.ఇక దూకుడికి మారుపేరుగా వుండే ఎంపీ టీజీ వెంకటేష్ లాంటివాళ్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఓ ప్రైవేట్ కార్యక్రమం కోసం విశాఖ వచ్చిన అయన కమలనాధుల వ్యవహారశైలి మీద భలే చురకలు వేశారు.

రాష్ట్రానికి ప్రత్యేక హోదా..కనీసం రైల్వే జోన్ కూడా ఇవ్వని బీజేపీతో విశాఖ కార్పొరేషన్ ఎన్నికల్లో పొత్తు కోసం తాము వెంపర్లాడే అవసరం లేదని టీజీ కుండ బద్దలు కొట్టారు.ఆంధ్రాకి ఏమి చేయని బీజేపీ ప్రజాక్షేత్రంలోకి ఒంటరిగా వెళ్లి తమ శక్తిని పరీక్షించుకోవచ్చని సవాల్ విసిరారు.పనిలో పనిగా స్థానిక ఎంపీ,బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని కూడా కెలికి వదిలిపెట్టారు.

రాష్ట్ర పార్టీకి నాయకత్వం వహిస్తున్న వాళ్ళు కేంద్రం నుంచి ఏమి సాధించారని నిలదీశారు.ప్రత్యేక హోదా కోసం ఎందుకు పోరాడడం లేదని ప్రశ్నించారు.ప్యాకేజ్ వార్తలు రాజ్యమేలుతున్న వేళ …అందరూ ఢిల్లీ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నవేళ టీజీ వ్యాఖ్యలు మళ్లీ దేశం,కమలం మధ్య అగ్నికి ఆజ్యం పోసినట్టయింది.

SHARE