జయ అయితే పవన్ పనయ్యేదా ?

 tg venkatesh said about pawan kalyan speechతమిళనాట జయస్తోత్రం బహు సాధారణం.అయితే రాష్ట్రానికి చెందిన దేశం ఎంపీ టీజీ వెంకటేష్ ఈసారి ఆ పని చేశారు.పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తూ మాట్లాడిన ఆయన అదే తమిళనాట ముఖ్యమంత్రిని,ఎంపీల్ని ఇలా మాట్లాడితే జయ కాళ్ళు విరగ్గొట్టించి లోపల వేసేదని అన్నారు.జనసేనకు కూడా ప్రజారాజ్యం గతి పడుతుందని టీజీ హెచ్చరించారు.ఎంపీల్ని తిట్టడం కాకుండా హోదా కోసం ఏమి చేశారో చెప్పాలని అయన పవన్ ని నిలదీశారు.ఇన్నాళ్లు కుంభకర్ణుడిలా నిద్రపోయి ..ఇప్పుడు హోదా కోసం పోరాడుతున్న తమని తిట్టడం భావ్యమా అని టీజీ ప్రశ్నించారు.

మరో ఎంపీ కేశినేని నాని కూడా పవన్ కి ఓ సూచన చేశారు.తిట్లు,చివాట్లు ఆపి హోదా కోసం ఎలాంటి పోరాటం చేయాలో చెబితే మేము కూడా మీదారిలో నడుస్తామని పవన్ ని కోరారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here