అర్ధరాత్రి తమన్ అదిరిపోయే షాక్ ఇచ్చాడు

Posted November 8, 2016

tm1816సౌత్ లో క్రేజీ మ్యూజిక్ డైరక్టర్స్ లో తమన్ కూడా ఒకరని చెప్పాలి. రొటీన్ కు భిన్నంగా సరికొత్త స్టైల్ లో మ్యూజిక్ అందిస్తాడని తమన్ కు మంచి పేరుంది. అంతేకాదు అప్పుడప్పుడు కాపీ క్యాట్ అపవాదాలు మూటకట్టుకున్నాడు. కిక్ సినిమాతో తన కెరియర్ ప్రారంభించిన తమన్ అతి తక్కువ టైంలోనే స్టార్స్ కు మ్యూజిక్ అందించడంలో సక్సెస్ అయ్యాడు. ఇక ఇప్పుడు తనకు వచ్చిన ఓ గొప్ప అవకాశాన్ని సోమవారం అర్ధరాత్రి ఎనౌన్స్ చేసి అందరికి షాక్ ఇచ్చాడు.

ప్రస్తుతం తెలుగు తమిళ సినిమాలకు మ్యూజిక్ అందిస్తున్న తమన్ త్వరలో పవర్ స్టార్ సినిమాకు మ్యూజిక్ ఇవ్వబోతున్నాడట. ఇప్పటిదాకా పవన్ తో కలిసి చేసే అవకాశం రాకపోవడంతో నిరాశ పడ్డ తమన్ నేసన్ డైరక్షన్లో పవర్ స్టార్ చేస్తున్న సినిమాకు తాను మ్యూజిక్ డైరక్టర్ గా ఓకే అవడంతో ఆ విషయం అర్ధరాత్రి ఎనౌన్స్ చేసి తన సంతోషాన్ని పంచుకున్నాడు. మహేష్, ఎన్టీఆర్ లాంటి వారికి ఎప్పటి నుండో మ్యూజిక్ ఇస్తున్న తమన్ మొదటిసారి పవన్ కు మ్యూజిక్ అందించే ఛాన్స్ వచ్చింది. మరి ఈ అవకాశాన్ని తమన్ ఎలా వినియోగించుకుంటాడో చూడాలి.

SHARE