కాపీ రాయుడు అక్కడైనా కొత్తగా ట్రై చేసేనా?

0
527
Thaman to compose music for bollywood movie Golmaal 4

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

Thaman to compose music for bollywood movie Golmaal 4తెలుగు మరియు తమిళంలో దేవిశ్రీ ప్రసాద్‌ తర్వాత యంగ్‌ స్టార్‌ హీరోలకు కనిపించే ఏకైక సంగీత దర్శకుడు థమన్‌. ముఖ్యంగా తెలుగులో థమన్‌కు వరుసగా ఆఫర్స్‌ వస్తున్నాయి. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా థమన్‌ అన్ని సినిమాలకు మ్యూజిక్‌ చేస్తూ ఉంటాడు. దేవిశ్రీ ప్రసాద్‌తో పోల్చితే పారితోషికం విషయంలో చాలా తేడా ఉండటంతో అంటే తక్కువ ఉండటంతో థమన్‌ వెంటే ఎక్కువ నిర్మాతలు పడుతుంటారు. అందుకే తక్కువ సమయంలో ఎక్కువ సినిమాలు చేసి ఈతరం సంగీత దర్శకుల్లో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. అలాగే ఒక చెత్త రికార్డును కూడా ఈయన తన ఖాతాలో వేసుకున్నాడు.

థమన్‌ చేసే ప్రతి పాట మరియు బ్యాక్‌ గ్రౌండ్‌ మ్యూజిక్‌ థీమ్‌ ఎక్కడనుండో కాపీ కొట్టిందే ఉంటుంది. గతంలో పలు పాటలతో థమన్‌ సాక్షాధారాలతో పట్టుబడ్డాడు. దాంతో స్టార్‌ హీరోలు ఈయనతో సినిమాలు చేసేందుకు కాస్త వెనుక ముందు ఆడుతున్నారు. అయినా కూడా తప్పని పరిస్థితుల్లో ఆయనతోనే సినిమాలు చేస్తున్నారు. ఇప్పుడు థమన్‌కు బాలీవుడ్‌ నుండి అవకాశం వచ్చింది. రోహిత్‌ శెట్టి దర్శకత్వంలో ‘గోల్మాల్‌ 4’ చిత్రం తెరకెక్కబోతుంది. ఆ సినిమాకు థమన్‌ సంగీతం అందించేందుకు అవకాశం అందుకున్నాడు. బాలీవుడ్‌లో అయినా ఈయన ఫ్రెష్‌ ట్యూన్స్‌ను అందిస్తాడేమో చూడాలంటూ ఆయనపై సోషల్‌ మీడియాలో సెటైర్స్‌ పడుతున్నాయి.

Leave a Reply