తను వచ్చెనంట మూవీ రివ్యూ….

 Posted [relativedate]

thanu vachenanta movie reviewచిత్రం : తను వచ్చెనంట (2016)
నటీనటులు : రష్మీ గౌతమ్, తేజ, ధన్య బాలకృష్ణనన్
సంగీతం : రవిచంద్ర
దర్శకత్వం : వెంకట్ కంచెర్ల
నిర్మాత : చంద్రశేఖర్ ఆజాద్ పాటిబండ్ల
రిలీజ్ డేట్  : 21 అక్టోబర్, 2016

యాక్షన్, సెంటిమెంట్, ఫ్యామిలీ, రొమాంటిక్, థ్రిల్లర్, కామెడీ, హర్రర్ కామెడీ.. జోనర్లలో సినిమాలొచ్చాయి. ఇప్పుడో కొత్త జానర్ వచ్చేసింది. అదే జామెడీ. ఈ జోనర్ లో తెరకెక్కిన చిత్రమే ‘తను వచ్చెనంట’. హర్రర్ కామెడికి కాస్తంత కొత్తదనం జోడించి జామెడీ జోనర్ అని పేరు పెట్టేశారు. రష్మీ గౌతమ్, తేజ, ధన్య బాలకృష్ణనన్.. తదితరులు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘తను వచ్చెనంట’ ఈరోజు  (శుక్రవారం) ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి. ఈ చిత్రం ప్రేక్షకులని ఏ మేరకు మెప్పించింది. కొత్త జోనర్ జామెడీ ఎలా ఉంది. అసలు ఈ చిత్ర కథేంటో.. ? తెలుసుకునేందుకు రివ్యూలోకి వెళదాం పదండీ..

కథ :
తేజ (తేజ)కు శ్వేత (ధన్య బాలకృష్ణన్) చాలా ఇష్టం. ఇద్దరు పీకల్లోతు ప్రేమలో ఉంటారు. అయితే, కుటుంబపరమైన కారణాల చేత తేజ మరో అమ్మాయి శృతి
(రష్మి)ని పెళ్లాడాల్సి వస్తుంది. పెళ్లాయ్యాక శృతి పెట్టే టార్చర్ మాములుగా ఉండదు. ఓ వైపు పెళ్లాం టార్చర్, మరోవైపు, ప్రేమించిన అమ్మాయి శ్వేతని మర్చిపోలేక పిచ్చెక్కిపోతాడు తేజ. ఇలాగైనా శృతిని వదిలించుకోవాలని డిసైడ్ అవుతాడు. ఈ క్రమంలో ఓ భయంకరమైన తప్పు చేస్తాడు. ఇంతకీ తేజ చేసిన భయంకరమైన తప్పేంటి.. ? తేజ మళ్లీ శ్వేతకి దగ్గరయాడా.. ?? తేజ జీవితంలో శృతి మళ్లీ ఎలా వచ్చింది.. ??? అన్నది మిగితా కథ.

ప్లస్ పాయింట్ :
* కామెడీ
* చలాకీ చంటి
* రష్మీ

మైనస్ పాయింట్స్ :
* సెకాంఢాఫ్
* క్లైమాక్స్
* పాత సినిమాల ప్రభావం

నటీనటుల ఫర్ ఫామెన్స్ :
జామెడీ అనే కొత్త రకం జానర్ పాయింట్ బాగానే ఉంది. ఆత్మల చుట్టూ తిరిగే రొటీన్ హర్రర్ కథలకు కాస్త డిఫరెంట్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయంలేని జాంబీతో హర్రర్, దానికి అదనంగా కామెడిని కలిపి..  ‘జామెడీ’ జానర్ అంటూ కొత్త జానర్ ని తీసుకొచ్చారు. అయితే, ఈ కొత్త జానర్ కి దర్శకుడు పూర్తి న్యాయం చేయలేకపోయాడు. మనసులేని జాంబీతో క్లైమాక్స్ లో ఎమోషన్ ని పండించాడు. అయితే, కామెడీని పండించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. చలాకీ చంటి కామెడీ సినిమాకే హైలెట్ గా నిలిచింది. తేజ, రష్మీ, ధన్య బాలకృష్ణనన్ నటనతో ఫర్వాలేదనిపించారు. అయితే, ‘గుంటూరు టాకీస్’ చూసిన ప్రేక్షకులు మరోసారి రష్మీ హాట్ హాట్ అందాలని చూద్దామని ‘తను వచ్చెనంట’ తరలి వస్తే.. వారికి నిరాశ తప్పలేదు. రష్మీ ఏమాత్రం కరుణించలేదు. దీంతో.. ఆ రకం ప్రేక్షకుడు కాస్త నిరాశ చెందక తప్పదు. మిగితా పాత్రలు పెద్దగా రిజిస్టర్ కావు.

సాంకేతికంగా :
కొత్త జానర్ ‘జామెడీ’కోసం వెఌతే కామెడీ తప్ప మరోటి కనిపించదు.సినిమాటోగ్రఫీ బాగుంది. రవిచంద్ర అందించిన సంగీతం సో.. సో.. గానే ఉంది. అయితే, శశి ప్రీతమ్ నేపథ్య సంగీతంతో ఆకట్టుకొన్నాడు.ఎడిటింగ్ ఓకే.ప్రొడక్షన్ వాల్యూస్ బడ్జెట్ కి తగ్గట్టుగా ఉన్నాయి.మొత్తంగా కొత్త జానర్ జామెడీ తెరపై రిచ్ గానే ఉంది. ఇకపై కూడా ఈ జానర్ లో చిత్రాలు చేస్తామంటే సాహసమే అవుతోంది. దర్శకులు అటు వైపు వెళ్లకపోవడమే మంచిది.

చివరగా : కొత్త జానర్ ‘జామెడీ’ జోనర్ పేరు చెప్పి.. పాత కామెడీనే చూపించారు. ఈ శుక్రవారం నాలుగైదు సినిమాలు థియేటర్స్ లో వాలాయి. ఈ నేపథ్యంలో.. కొత్త జానర్ జామెడీని చూస్తానంటే సాహసమే అవుతుంది. రష్మీ, జబర్ దస్త్ కామెడీ హార్ట్ కోర్ ఫ్యాన్స్ ఆ సాహసం చేస్తే చేయొచ్చు.

బాటమ్ లైన్ : తను వచ్చెనంట.. తలనొప్పి తెచ్చెనంట

రేటింగ్ : 2/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here