దటీజ్ సూర్యకాంతం..

 Posted October 28, 2016

That is suryakantham
ఓ మనిషి అసలు రూపం ఒకటి ..తాను బయటికి కనిపించే తీరు మరొకటి.ప్రపంచం తన్ను చూసే తీరు ఇంకొకటి.ఈ మూడు కోణాల్లో బయటి ప్రపంచం ఓ మనిషిని చూడ్డం కష్టం.చూసినా ఒప్పుకోవడం ఇంకా కష్టం.ఒప్పుకున్నా గౌరవించడం మరీ కష్టం.ఈ కష్టం అన్న మాట ఆమెని నిజజీవితంలో చూస్తే ఇష్టమైపోయింది.తెర మీద కనిపిస్తే భయం,కోపం అయింది.అయినా ఆమె అంటే ఇప్పటికీ తగ్గని గౌరవముంది.ఇంతకీ ఆమె ఎవరోవేరే చెప్పాలా?ఇప్పటికీ ఆమె పేరు పెట్టుకోడానికి భయపడుతున్న తెలుగు ప్రజలారా ఆమె ఎవరో కాదు.

గయ్యాళి అత్తగా అందరి గుండెల్లో తిష్ట వేసుకుని కూర్చున్న సూర్యాకాంతం. తెర మీద సూర్యకాంతం కనబడితే తిట్లు ,శాపనార్ధాలు …ఆమె నోటి వెంట మాత్రమే కాదు ఇటు ప్రేక్షకుల నోటి వెంట కూడా .ఈ ఒక్క విషయం చాలదా ఓ నటిగా ఆమె ఏమిటో చెప్పడానికి.ఆమె లేకుండా సినిమా తీయడానికి విజయా లాంటి సంస్థలే ముందుకెళ్ళవు..ఇది చాలదా ఆమె క్రమశిక్షణ ఏమిటో చెప్పేందుకు..ఆమె ఇంటి భోజనం కోసం,ఆమె పలకరింపు కోసం ఎదురుచూడని నటులు లేరు …ఇది చాలదా ఆమె ప్రేమని చాటడానికి.ఇలా ముక్కోణాల్లో రాణించిన ఓ అద్భుతం సూర్యకాంతం.ఆమె పుట్టిన రోజు సందర్భంగా తెలుగుబుల్లెట్ అర్పిస్తున్న అక్షర నివాళి ఇదే ..

SHARE