నవంబర్ 8 ఏ ఎందుకు…. ?

Posted November 10, 2016
reliance gio offer is outజన్‌ధన్‌ యోజన ఖాతాల తెరిపించడం.. నల్లకుభేరులకు సొమ్ములను వైట్‌ చేసుకునేందు నేరుగా అవకాశం కల్పించడం.. ఆర్థికం రంగంలో మార్పులకు పచ్చ జెండా ఊపడం వంటివి ఎంతో క్రమ పద్ధతిలో చేసికొచ్చిన మోదీ కచ్చితంగా నవబంరు 8నే ఎందుకు ఎంచుకున్నారు.. అదీ రాత్రే ఎందుకు ప్రకటించారు.. మీకు సందేహం వచ్చింది కదా.. ప్రకటన ఎప్పు చేయాలనేది ఆషామాజీగా తీసుకున్న నిర్ణయం కాదు. దానిపై చాలా కసరత్తు చేసే ఎంపిక చేశారు. అమెరికా ఎన్నికల పోలింగ్‌.. కౌంటింగ్‌ ఎప్పడనేది వెల్లడి చేసి చాలా కాలమైంది… ప్రస్తుతం దేశమంతా అక్కడి ఎలక్షన్లను ఎంతో ఆసక్తిగా గమనిస్తున్నారు. దాంతోపాటు మీడియా సైతం అత్యుత్సాహం చూపుతూ మరీ ఎక్కువ కథనాలు కూడా ఇచ్చింది.. ఈ నేపఽథ్యంలోనే ఎన్నికలు జరిగేరోజైతే ఇటు ఉన్నత వర్గాలు, అటు మీడియా పూర్తిస్థాయిలో నోట్ల రద్దు నిర్ణయంపై కథనాలు.. చర్చలు చేపట్టేందుకు అవకాశం లేదనే ఈ తేదీని మొదట ప్రతిపాదించారట.. అందుకే ఆ రోజును మోదీ ఎంపికచేసుకున్నారు. ఇది బానే ఉంది.. రాత్రి ఎందుకు చెప్పినట్లు అనుకుంటున్నారా.. ప్రతి బ్యాంకు 5 గంటలకు కార్యకలాపాలు ముగిసిన తరవాత విధిగా ఉన్న క్యాష్‌ వివరాలు ఆర్బీఐకి పంపాల్సి ఉంటుంది.
దాదాపు ఆ తతంగం అంతా పూర్తయ్యేసరికి రాత్రి 8 గంటలు పడుతుంది.. అప్పుడు ప్రకటిస్తే ఉన్న క్యాష్‌ని ఎవరూ మార్చలేరు. లేదంటే ప్రకటన ఒకటి రెండు గంటల ముందు తెలిసినా బ్యాంకు మేనేజర్లను సైతం కొనేసి చిన్ననోట్ల స్థానంలో పెద ్ద నోట్లు పెట్టి కథనడిపేవారు.. దాంతో చిన్న నోట్ల కొరత వచ్చి పరిస్థితి మరింత దారుణంగా ఉండేది.. వీటంన్నిటీ అధ్యయనం చేసే రాత్రి ఎనిమిదికి ప్రసంగం మొదలుపెట్టారు. దాంతో పాటు ఆ రోజు కొంచెం సమయం దొరికినా బంగారు దుకాణలపై పడి వాటిని కొనుగోలు చేస్తారనే షాపులు మూసేసే సమయానికి వెల్లడించారు.. దీన్ని బట్టి మోదీ ఏది చేసినా ఓ లెక్క ఉంటుంది.. మరి.. రెండేళ్లో ఇంత భారీ నిర్ణయానికి నాంది పలికారంటే.. పదవీ పూర్తికాలంలో ఇంకెన్ని సమాజహిత అంశాలను చేపడతారో వేచిచూడాల్సిందే..
– శ్రీ
SHARE