Tuesday, August 16, 2022
HomeEntertainmentCinema Latestకొత్త ట్విస్ట్‌ : రానా భార్యను నేనంటే నేనంటున్న ఆ ఇద్దరు

కొత్త ట్విస్ట్‌ : రానా భార్యను నేనంటే నేనంటున్న ఆ ఇద్దరు

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

యువ హీరో రానా ‘బాహుబలి’ చిత్రంలో భల్లాలదేవుడిగా నటించి మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు. ‘బాహుబలి 2’లో విలన్‌గా కనిపించి కూడా అద్బుతమైన నటనను కనబర్చి మెప్పించిన రానా ప్రస్తుతం తేజ దర్శకత్వంలో ‘నేనే రాజు నేనే మంత్రి’ చిత్రంలో నటిస్తున్న విషయం తెల్సిందే. ఈ చిత్రంలో హీరోయిన్‌గా కాజల్‌ అగర్వాల్‌ నటిస్తున్నట్లుగా ఇన్ని రోజులుగా ప్రచారం జరుగుతు వచ్చింది. అయితే తాజాగా చిత్ర యూనిట్‌ విడుదల చేసిన మూడు పోస్టర్‌లు సినిమాపై చాలా ఆసక్తిని కలిగిస్తున్నాయి.

రానా ఉన్న పోస్టర్‌లో ‘నేనే రాజు నేనే మంత్రి’ అని, కాజల్‌ ఉన్న పోస్టర్‌లో ‘నేనే రాధ నేనే భార్య’ అని, ఇక మరో హీరోయిన్‌ కేథరిన్‌ తెర్సా ఉన్న మరో పోస్టర్‌ను విడుదల చేయడం చేయడం జరిగింది. దాంటో ‘కాదు నేనే రాణి నేనే భార్య’ అని ఉంది. దాంతో సినిమాలో కేథరిన్‌ పాత్ర ఏంటా అని ఇప్పుడు అంతా చర్చించుకుంటున్నారు. రాజకీయ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఇలాంటి ఒక ట్విస్ట్‌ ఉంటుందని ఏ ఒక్కరు ఊహించలేదు. ఇంతకు రానా భార్య ఎవరు అనేది సినిమా విడుదల అయితే కాని తెలియదు. తేజ గతంలో పలు సూపర్‌ హిట్‌ చిత్రాలు తెరకెక్కించాడు. కాని గత కొన్నాళ్లుగా ఆయన సినిమాలు సక్సెస్‌కు ఆమడ దూరంలో ఉంటున్నాయి. దాంతో ఈ చిత్రం అయినా సక్సెస్‌ అవుతుందా అనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. కాని విడుదల దగ్గర పడుతున్న కొద్ది సినిమాపై ఆసక్తి మాత్రం బాగా పెరిగి పోతుంది. ఈ చిత్రం టీజర్‌ను ఇటీవలే విడుదల చేయడం జరిగింది. టీజర్‌కు అదిరిపోయే రెస్పాన్స్‌ వస్తుంది.

- Advertisment -
spot_img

Most Popular