దేశంపై కన్నేసిన కృష్ణా వైసీపీ నేతలెవరు?

 Posted November 7, 2016

the ycp ministers who had an eye on desamకృష్ణా జిల్లాలో వైసీపీ ని ఖాళీ చేయించాలన్న బలమైన లక్ష్యంతో టీడీపీ అడుగులేస్తోంది . తాజాగా గుడివాడలో ఆ పార్టీ ఎమ్మెల్యే నానికి టీడీపీ కోలుకోలేని షాక్ ఇచ్చింది.నాని ముఖ్య అనుచరుల్లో ఒకరైన గుడివాడ మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు సహా 10 మంది వైసీపీ కౌన్సిలర్లు దేశంలో చేరిపోయారు.సీఎం చంద్రబాబు టార్గెట్ గా చెలరేగిపోయే కొడాలి నానికి చెక్ పెట్టేందుకు చాప కింద నీరులా జిల్లా మంత్రులు,ఎమ్మెల్యేలు ఈ ఆపరేషన్ పూర్తి చేశారు. అయితే ఇది అక్కడితో ఆగిపోయేదికాదని తెలుస్తోంది.కృష్ణా జిల్లా వైసీపీ లో కీలక పాత్ర పోషిస్తున్న మరో ముగ్గురు నాయకులు ఇప్పటికే టీడీపీ అధిష్టానంతో టచ్ లో ఉంటున్నట్టు తెలుస్తోంది.

జిల్లా మంత్రి దేవినేని ఉమా చూచాయగా ఈ విషయం బయటపెట్టడంతో వైసీపీ హైకమాండ్ అలెర్ట్ అయ్యింది.తాము డౌట్ పడుతున్న నేతలతో సంప్రదింపులు మొదలెట్టింది.అయితే అలాంటిదేమీ లేదని ఆ నాయకులు జవాబివ్వడంతో ఏమి చేయాలో అర్ధం కాక ఊరుకుంది.అంతకు మించి మాట్లాడితే అనుమానిస్తున్నారన్న కారణం చూపి చెక్కేస్తారేమోనని వైసీపీ భయపడుతోంది.ఇంతకీ టీడీపీ తో టచ్ వున్న నాయకుల్లో ఓ ఎమ్మెల్యే, ఓ మాజీ మంత్రి ఉన్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.

SHARE