దాసరి పోవడంతో ఆ నలుగురికి ఎదురు లేదు

1192
they-four-do-not-have-to-wa

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

టాలీవుడ్‌ను ఆ నలుగురు నిర్మాతలు ఏలేస్తున్నారు, వారు ఏం చెబితే అదే జరగాలి, ఏం చేసినా ఎవరు ఏం చేయలేరు. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న దాదాపు అన్ని థియేటర్లు కూడా ఆ నుగురి చేతిలోనే ఉన్నాయని, చిన్న సినిమాలు విడుదల అవ్వడం, అవ్వకుండా ఉండటం వారి చేతిలోనే ఉంటుందని అంతా అంటూ ఉంటారు. అయితే ఆ నలుగురు ఎప్పుడు చిన్న చిత్రాలను తొక్కేయాలని చూసినా ఇంత కాలంగా దాసరి ముందుండేవారు. చిన్న నిర్మాతలకు సాయం, ఆ నలుగురికి వ్యతిరేకంగా దాసరి ఎన్నో సార్లు మాట్లాడిన సందర్బాలున్నాయి.

దాసరి నారాయణ రావు చిన్న సినిమాలకు పెద్ద బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరించడంతో పాటు, చిన్న చిత్రాలకు థియేటర్స్‌ లభించడంలో తన వంతు కృషి చేసేవారు. అందుకే చిన్న నిర్మాతలకు, చిన్న చిత్రాలకు దాసరి గాడ్‌ ఫాదర్‌ అయ్యారు. ఇప్పుడు ఆ గాడ్‌ ఫాదర్‌ చనిపోయాడు. దాంతో ఆ నలుగురు టాలీవుడ్‌ను మరింతగా దున్నేయడం ఖాయం. చిన్న నిర్మాతలు, చిన్న సినిమాలు పెద్ద దిక్కును కోల్పోయాయి. పాపం ఇప్పుడు చిన్న చిత్రాలను ఆదుకునేందుకు ఎవరున్నారు, ఆ నలుగురు నుండి టాలీవుడ్‌ను రక్షించేది ఎవరు అంటూ కొందరు నిర్మాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here