ఫైల్ కోసం వచ్చాడా ..?జగన్ కోసం వచ్చాడా ..?

Posted November 18, 2016

thief wants to steal files in gagan vihar cbi courtగగన్‌విహార్‌లో ఉన్న సీబీఐ కోర్టులో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. గగన్‌విహార్‌లోని సీబీఐ కోర్టులో ఓ గుర్తుతెలియని దుండగుడు దొంగతనానికి ప్రయత్నించాడు. సీబీఐ అధికారుల చాంబర్‌లో ఫైల్స్ దొంగిలించేందుకు ప్రయత్నిస్తుండగా .గమనించిన సీబీఐ అధికారులు అప్రమత్తమయ్యారు.

అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ సంఘటన జరిగిన సమయంలో ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ కోర్టు హాల్‌లో ఉన్నారు. ఈ ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎంతోసీక్రెట్ గా ఉన్న ఫైల్స్‌ను దొంగిలించడానికి వచ్చింది ఎవరు ? ఎవరి కోసమో తెలుసుకోవడానికి అధికారులు అతనిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

SHARE