తిక్క‌ రివ్యూ….

  thikka movie review

చిత్రం : తిక్క‌ (2016)
న‌టీన‌టులు : సాయిధ‌ర‌మ్ తేజ్‌, లారిస్సా బోనాసి, మన్నారచోప్రా
సంగీతం : ఎస్ఎస్‌.థ‌మ‌న్‌
బ్యాన‌ర్ : శ్రీ వెంక‌టేశ్వ‌ర మూవీ మేక‌ర్స్‌
నిర్మాత‌ : రోహిన్‌రెడ్డి
ద‌ర్శ‌క‌త్వం : సునీల్‌ రెడ్డి
రిలీజ్ డేట్‌ : 13 ఆగ‌స్టు, 2016
రేటింగ్ : 2.25/5

మెగా యంగ్ హీరో సాయిధరమ్ తేజ్ మాంఛి జోరుమీదున్నాడు. సుబ్రమణ్యం ఫర్ సేల్, సుప్రీమ్ లతో వరుసగా రెండు విజయాలని ఖాతో వేసుకొన్నాడు. తాజాగా, ‘తిక్క’తో హ్యాట్రిక్ పై కన్నేశాడు. సునీల్ రెడ్డి దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్, లరిస్సాబోన్సి, మన్నారచోప్రా లు జంటగా నటించిన చిత్రం తిక్క. ఈ
చిత్రానికి సంగీతం థమన్. రోహిన్‌ రెడ్డి నిర్మాత. అయితే, హ్యాట్రిక్ సాధించడం అంతా ఈజీ కాదు. అందుకే తేజు పక్కా ప్లాన్ వేశాడు. ఈసారి కూడా పక్కాగా యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ ని ఎంచుకొన్నాడు. తన ‘తిక్క’నంతా చూపించైనా హ్యాట్రిక్ హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు. తేజు ‘తిక్క’ ఈరోజు థియేటర్లోకి వచ్చేసింది. మరీ.. తేజు ‘తిక్క’ ఓ లెక్క ప్రకారమే  ఉందా.. ? తేజు తిక్క చేష్టలు ప్రేక్షకులని ఏ మేరకు అలరించాయో తెలుసుకునేందుకు రివ్యూలోకి వెళదాం పదండీ..

కథ :
టైటిల్ కి దగ్గట్టుగానే ఆదిత్య (సాయిధరమ్ తేజు) పాత్ర తిక్క తిక్కగా ఉంది. అల్లరిచిల్లరగా తిరుగుతూ ఉండే ఓ సాధారణ యువకుడు. సింపుల్ గా చెప్పాలంటే.. ఓ లక్ష్యమంటూ లేని కుర్రాడు. అన్ని సినిమాల్లోగానే ఏ పనిలేని కుర్రోడికి లవ్వే పని అన్నట్టు. అమ్మాయిల వెంట పడడం తప్ప ఇంకే పనులూ లేని ఆదిత్య జీవితంలోకి అంజలి (లారిస్సా బొనెసి) ప్రవేశిస్తుంది. ఫస్ట్ చూపులోనే అంజలి ప్రేమలో పడిపోతాడు ఆదిత్య. పవన్ కళ్యాణ్ ఏదో సినిమాలో చెపినట్టు. అమ్మాయి ఎప్పుడైనా లవ్ లో పడాల్సిందే. పడుద్దీ అన్నట్టు.. కొన్నాళ్ల తర్వాత అంజలీ ఆదిత్యతో ప్రేమలో పడుతుంది. కొన్ని అనుకోని కారణాల వల్ల అంజలి, ఆదిత్యకు బ్రేకప్ చెబుతుంది. బ్రేకప్ అయినోడి అడ్రస్ బార్ అయినట్టు.. ఆదిత్య తాగడమే పనిగా పెట్టుకొంటాడు. ఆ మత్తులో ఏవేవో తిక్క తిక్క పనులు చేసేస్తాడు. ఆ తిక్క పనులే తలనోప్పిగా మారుతాయి. ఇంతకీ.. మత్తులో ఆదిత్య చేసిన తిక్క పనులేవీ ? అంజలి, ఆదిత్యకు బ్రేకప్ ఎందుకు చెబుతుంది ? అనేది ఎనో కన్ఫూజన్స్, ట్విస్టులతో సాగే మిగిలిన కథ.

ప్లస్ పాయింట్స్ :
* సాయి ధరమ్ తేజ్
* థమన్ సంగీతం
* కామెడీ

మైనస్ పాయింట్ :
* కన్ఫూజన్ సీన్స్
* * హీరోయిన్స్
* క్లైమాక్స్

నటీనటుల పెర్ ఫామెన్స్ :
టైటిల్ ‘తిక్క’. పైగా హీరో మెగా హీరో సాయి ధరమ్ తేజు.. ఇప్పుడిప్పుడే యూత్ లో పాగ వేస్తున్నాడు. సబ్జెక్ట్ లవ్ ఫెల్యూర్. ఎవర్ గ్రీన్ సబ్జెక్ట్. ఇంతకంటే ఇంకేం కావాలి అనుకున్నట్టున్నాడు దర్శకుడు సునీల్ రెడ్డి. టైటిల్ కి న్యాయం చేయాలనో, మరో ఇతర ఆలోచనో కానీ.. తిక్క తిక్క గా తీశాడు. థియేటర్స్ వచ్చిన ప్రేక్షకులకి తిక్కరేగేలా చేశాడు. కన్ఫూజన్ సీన్స్, తేలిపోయే క్లైమాక్స్ తో తేజు కేరిర్ ల్ ఓ ‘తిక్క’ సినిమాగా మిగిలిపోయేలా చేశాడు. ఒక్కమాటలో చెప్పాలంటే సునీల్ రెడ్డి మళ్లీ ఫెయిల్ అయ్యాడు. ఇక, హీరో సాయి ధరమ్ తేజుకి వంక పెట్టాల్సిన పని లేదు. తనమట్టుకి బాగా చేశాడు. సాయి పాత్ర యూత్ లో ఓ వర్గం వారికి విపరీంగా నచ్చేయొచ్చు.తిక్క హీరోయిన్స్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచింది. బాబోయ్ వారి ఎక్స్ ప్రెషన్స్ ని చూడలేం. తేజు, రాజేంద్ర ప్రసాద్ పాత్రలు మినహా ఇంకెవ్వరి పాత్రలు రిజిస్టర్ కావు.

సాంకేతిక విభాగం :
రిలీజ్ కి ముందే ‘తిక్క’పై పాజిటివ్ టాక్ తెచ్చిందీ మ్యూజిక్ నే. ఈ సినిమాని కాస్తో కూస్తో నిలబెట్టింది అంటే అదీ కూడా థమన్ అందించిన మ్యూజిక్ నే. థమన్ పాటలు, నేపథ్య సంగీతం బాగుంది. యూత్ ఈజీగా కనెక్ట్ అవ్వొచ్చు. ఎడిటింగ్ ఓకే. సినిమా ఫోటో గ్రఫీ ఫర్వాలేదు. తెరపై తిక్క కాస్ట్లీ గానే  ఉంది. బడ్జెట్దా దాపు రూ. 22కోట్లకి న్యాయం చేసేల రిచ్ నెస్ కనబడుతోంది.

తెలుగు బుల్లెట్ అనాలసిస్ :
సినిమాలో లవ్ మేటర్ ఉంటే చాలు.. ఇంకెలాంటి తిక్క తిక్క వేషాలు  ఉన్నా ఫర్వాలేదని ఫిక్సయ్యే ప్రేక్షకులు తేజు ‘తిక్క’ ని ఓ సారి చూసేయొచ్చు. ఇక, మిగతా రకం ప్రేక్షకులు ‘తిక్క’ థియేటర్స్ కి వెళ్లకపోవడమే సేఫ్..

బాటమ్ లైన్ : ‘తిక్క’కెళితే ‘తొక్క’వుతారు..

SHARE