తిక్క లెక్కల్లో బొక్కలు ..

0
516

 thikka movie wrong collectionsసాయిధరమ్ తేజ్ ‘సుప్రీమ్’ పాజిటివ్ టాక్తో మొదలై.. సూపర్ హిట్టయింది. మొత్తంగా రూ.25 కోట్లు వసూలు చేసి అతని కెరీర్లో బిగ్గెస్ట్ హిట్టుగా నిలిచింది. ఐతే తేజు కొత్త సినిమా ‘తిక్క’ కేవలం మూడు రోజుల్లోనే రూ.19.63 కోట్లు వసూలు చేసిందంటూ పోస్టర్లు దర్శనిమస్తున్నాయి. సాయిధరమ్ స్టామినాకు ఇది నిదర్శనమంటూ మెసేజ్‌లు కూడా పబ్లిష్ చేస్తున్నారు. ‘తిక్క’ విషయంలో జరుగుతున్న ప్రచారం చాలామందిని సర్‌ప్రైజ్ చేస్తోంది.

సినిమాను ఎలాగైనా ఆడించేయాలన్న తపనతో.. జనాల చెవుల్లో పువ్వులు పెడుతున్నారన్న అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి. పూర్తి నెగెటివ్ టాక్ తో మొదలైన ఈ సినిమాకు సరైన ఓపెనింగ్సే లేవు. తేజు వరుస హిట్లతో ఊపు మీదున్నా సరే.. ‘తిక్క’కు రెస్పాన్స్ తక్కువగా ఉంది. ‘తిక్క’కు ముందు రోజు విడుదలైన ‘బాబు బంగారం’కు కూడా నెగెటివ్ టాక్ వచ్చింది. కానీ ఆ సినిమాకు కలెక్షన్లు బాగానే ఉన్నాయి.

కానీ తేజు మూవీ పరిస్థితే బాగాలేదు. మూడు రోజుల్లో రూ.4 కోట్ల దాకా ఈ సినిమా షేర్ వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. టోటల్‌గా ఆరేడు కోట్లు ఉండొచ్చేమో. దాన్ని కొంచెం అతి చేసి పది కోట్లు చెప్పుకున్నా ఓకే. కానీ.. మరీ మూడు రోజుల్లో దాదాపు రూ.20 కోట్లంటే నమ్మేదెవరు? ఈ ప్రచారం ఎవరు చేస్తున్నారో తెలియదు కానీ.. ఇది తేజుకు మాత్రం ఏమాత్రం మేలు చేసేది కాదు.

Leave a Reply