తిక్క ప్రివ్యూ….

Spread the love

  thikka preview

మెగా యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్ జోరుమీదున్నాడు. వరుసగా మాస్-యాక్షన్ సినిమాలని చేస్తూ దూసుకెళ్తున్నాడు. మినిమమ్ గ్యారెంటీ హీరోగా ఎదుగుతున్నాడు. తేజు ‘సుప్రీం’ సూర్య ’24’ పోటిగా రిలీజై దాదాపు రూ.25కోట్లకిపైగా వసూలు చేసింది. ఈ జోష్ మీదే తేజు ‘తిక్క’ స్టార్ట్ చేశాడు. ఈ సినిమాతో మ‌నోడు హ్యాట్రిక్‌పై క‌న్నేశాడు. సునీల్‌రెడ్డి దర్శకుడు. తేజు సరసన లరిస్సాబోన్సి, మన్నారచోప్రా జతకట్టనున్నారు. ఈ చిత్రానికి సంగీతం థమన్. రోహిన్‌ రెడ్డి నిర్మాత. తిక్కలో తేజు లవ్ ఫెల్యూర్ అబ్బాయిగా కనిపించనున్నాడు. ఈ శనివారం (ఆగస్టు 13) తేజు థియేటర్స్ ల్ తిక్కని చూపించబోతున్నాడు. ఈ చిత్ర విశేషాలపై ఓ లుక్కేద్దాం పదండీ..

ప్రివ్యూ :
* ‘తిక్క’ టైటిల్ కొత్తగా ఉంది
* పైగా ఇందులో తేజు లవ్ ఫెల్యూర్ అబ్బాయిగా కనిపించనున్నాడు
* దీంతో.. తేజు నుంచి యూత్ ని అట్రాక్ట్ విపరీతంగా అట్రాక్ట్ చేసే యాక్టింగ్ ని ఎక్స్ పెక్ట్ చెయొచ్చు.
* మరి.. ఇందులో తేజు ఎంత వరకు సక్సెస్ అయ్యాడన్నది తెరపై చూడాలి
*  హీరో.. ఓ హై క్లాస్ అమ్మాయితో ప్రేమ‌లో ప‌డ‌తాడు. ఆ ప్రేమ బ్రేక‌ప్ అవుతుంది.
* ఆ బాధ త‌ట్టుకోలేక ఫ్రెండ్స్‌తో మందు పార్టీ ఎంజాయ్ చేస్తాడు.
* చివ‌ర‌కు ఆమె ప్రేమ‌ను ఎలా పొందగలిగాడు.. ?
* ఈ ప్రయత్నంలో హీరోకి ఎదురైన సవాల్లు ఏంటి ? అనేది చిత్ర కథ.
* ఇలాంటి కథలో తేజు వాడుకోవడంలో దర్శకుడు సునీల్ రెడ్డి వందశాతం సక్సెస్ అయ్యాడని చెబుతున్నారు.
* సునీల్ రెడ్డి టెక్నికల్ గానూ కమాండ్ ఉన్న దర్శకుడు.
* ట్రైలర్, టీజర్ తోనే పాజిటివ్ టాక్ రావడం తిక్కకి కలిసొచ్చే అంశం
* రిలీజ్ కి ముందే తిక్క పాజిటివ్ టాక్ రావడంలో థమన్ క్రెడిట్ చాలా  ఉంది.
* మంచి పాటలు, వాటికి మంచి సంగీతాన్ని అందించాడు.
* ధనుష్ తో ‘తిక్క’టైటిల్ సాంగ్ పాడించి మరింత హైప్ తీసుకొచ్చాడు
* శింబు తో కూడా ఓ పాటని పాడించారు.
* ఇద్దరు  హీరోయిన్స్ తో గ్లామర్ డోస్ కూడా ఎక్కువైందట.

మొత్తానికి.. ‘తిక్క’ యూత్ ఫుల్ చిత్రంగా.. ఓ ట్రెండ్ సెట్ చేయడం ఖాయమంటున్నారు చిత్రబృందం. ఈ చిత్రం లైవ్ అప్ డేట్స్, పూర్తి రివ్యూ కోసం క్లిక్ చేస్తూనే ఉండండి మీ తెలుగు బుల్లెట్ డాట్ కామ్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here