మూడో డిబేట్ లోను హిల్లరీదే పై చేయి..

 Posted October 20, 2016

third debate hillary clinton better than trump
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటరు తీర్పు ఎలా ఉండబోతోందో దాదాపుగా స్పష్టమైంది.మూడో డిబేట్ లోను డెమొక్రాట్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ పై చేయి సాధించారు. లైంగిక వేధింపుల ఆరోపణలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్ మరోసారి తడబడ్డాడు.ఓటర్లని ప్రభావితం చేసే చర్చల్లో హిల్లరీ ముందు తేలిపోయాడు.మహిళల నుంచి ఎన్ని విమర్శలొస్తున్నా ట్రంప్ ధోరణి మారలేదు.తాజా చర్చలోనూ తన అహంభావం ప్రదర్శించాడు.మహిళల గురించి వస్తున్న ఆరోపణలని హిల్లరీ ప్రస్తావించినప్పుడు అయన ప్రతిస్పందన ఇలా వుంది ..’నేను ఇప్పటిదాకా నా భార్యకి కూడా క్షమాపణ చెప్పలేదు ..ఎందుకంటే నేనెప్పుడూ తప్పు చేయలేదు కనుక’. బిల్ క్లింటన్ శృంగార లీలలు.వ్యక్తిగత ఈ మెయిల్ వాడకం వంటి అంశాల ప్రస్తావన టైం లో హిల్లరీ ని ట్రంప్ కొంత ఇబ్బంది పెట్టినట్టు అనిపించినా మొత్తం మీద డెమొక్రాట్ అభ్యర్థిదే హవా అనిపించింది.

మూడో డిబేట్ ముగిశాక CNN /orc ప్రకటించిన సర్వే వివరాలు ఇలా వున్నాయి.
1.తొలి చర్చలో హిల్లరీ దే పై చేయని 62%,ట్రంప్ వైపు 27 శాతం అమెరికన్లు అభిప్రాయపడ్డారు.
2.రెండో చర్చలో హిల్లరీ కి అనుకూలంగా 57%,ట్రంప్ కి మద్దతుగా 34% మంది నిలిచారు.
3 . మూడో చర్చలో హిల్లరీ కి 52 %,ట్రంప్ కి 39 % అమెరికన్లు అండగా నిలిచారు.
నవంబర్ 8 న అమెరికన్లు ఎలెక్టర్స్ కి ఓటేస్తారు.వారి చేత ఎన్నికైన ఎలెక్టర్ లు డిసెంబర్ లో అధ్యక్ష అభ్యర్థులకు ఓటేస్తారు.2017 జనవరిలో ఓట్ల లెక్కింపు జరుగుతుంది.అదే నెల 20 వ తేదీన అమెరికా 45 వ అధ్యక్షుడు ప్రమాణస్వీకారం చేస్తారు.కానీ నవంబర్ 8 న జరిగే పోలింగ్ రోజే ఫలితాల సరళి దాదాపుగా అర్ధమైపోతుంది.

SHARE