స్టార్ టీవీ కి ఎన్టీఆర్ దొరికిందిలా!

0
1091
This Is How Ntr Caught To Star

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

This Is How Ntr Caught To Star
టీవీ రంగంలో సరికొత్త కార్యక్రమాలు,భారీ స్టార్స్ తో దూసుకెళ్తున్న స్టార్ టీవీ ఇప్పుడు తెలుగులో స్టార్ మా కోసం ఎన్టీఆర్ ని ఎంపిక చేసి సంచలనానికి తెర లేపింది.తెలుగులో బిగ్ బాస్ కార్యక్రమానికి ఎన్టీఆర్ హోస్ట్ చేయబోతున్నట్టు స్టార్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ..మా టీవీ తరపున చేసిన ప్రకటన తెలుగు వినోద రంగంలో ఎవరూ ఊహించని పరిణామం. ఎన్టీఆర్ ఓ టీవీ కార్యక్రమానికి గెస్ట్ గా రావడానికే తీరిక లేకుండా ఉంటే ఇక హోస్ట్ చేయడానికి ఒప్పుకుంటాడని ఎవరూ అనుకోరు.కానీ దాన్ని సాధ్యం చేసి చూపెట్టింది స్టార్ మా టీవీ.మెగా స్టార్ చిరంజీవితో చేసిన మీలో ఎవరు కోటీశ్వరుడు అనుకున్నంత సక్సెస్ కాకపోయినా స్టార్ ఇంకో కార్యక్రమం కోసం ఎన్టీఆర్ లాంటి పెద్ద స్టార్ ని ఎంచుకోవడం సాహసమే.అయితే స్టార్ కేవలం సాహసం కోసం సాహసం చేయలేదు.ఎంతో ఆలోచించి అన్ని లెక్కలు వేసుకుని బిగ్ బాస్ కోసం ఎన్టీఆర్ ని ఎంచుకుంది.

హిందీలో సల్మాన్ ఖాన్,తమిళ్ లో కమల్ హాసన్ హోస్ట్ చేస్తున్న షో బిగ్ బాస్.ఇందులో ఒకరు మాస్ హీరో,ఇంకోరు క్లాస్ హీరో.సల్మాన్ తెర మీద కనిపిస్తే చాలు ఓ వైబ్రేషన్.ఇక కమల్ బుల్లితెర మీద మాట్లాడే ప్రతి మాట అర్ధవంతం,ఆలోచనాత్మకం. ఆ ఇద్దరి లక్షణాలు కలగలిసిన స్టార్ తెలుగులో ఎవరు దొరుకుతారా అని స్టార్ మా వేట మొదలుపెట్టింది.ఆ వేటలో ఏకంగా యంగ్ టైగర్ దొరికేసాడు. ఎన్టీఆర్ తెర మీద కనిపించగానే ఓ మాస్ హీరోకి వుండే అప్పీల్ ఉంటుంది.ఇక ఏ ఆడియో ఫంక్షన్ లో ఎన్టీఆర్ మాట్లాడినా మొత్తం ఆడియన్స్ స్పెల్ బౌండ్ అవుతారు.మూడు పదుల వయసులో ఓ సెలబ్రిటీ అందులో సినీ రంగం నుంచి వచ్చి ఇంత పరిణితితో మాట్లాడడం ఎన్నడూ చూడలేము.ఈ లక్షణాలే స్టార్ మా నిర్వాహకుల్ని విపరీతంగా ఆకట్టుకున్నాయి.ఎన్టీఆర్ కి ముందు ఎన్ని పేర్లు అనుకున్నా స్టార్ మా చేసిన రీసెర్చ్ లో ఎన్టీఆర్ లా అలవోకగా మాట్లాడే,భావోద్వేగాల్ని పలికించే నటులు కనిపించలేదు.

అయితే స్టార్ మా ఎన్టీఆర్ కి ఫిక్స్ అయ్యాక కూడా వ్యవహారం అంత తేలిగ్గా ముందుకు నడవలేదు.ఎన్టీఆర్ ని టీవీ ప్రోగ్రాం చేసేలా ఒప్పించడానికి కూడా పెద్ద కసరత్తే జరిగింది. సల్మాన్, కమల్ లాంటి స్టార్స్ చేస్తున్న ప్రోగ్రాం …నాగ్,చిరు లాంటి స్టార్స్ హోస్ట్ చేసిన టీవీ కావడం వంటివి ఎన్టీఆర్ ని కూడా ఆలోచనలో పడేశాయి.ఇక పారితోషికం ఇటీవల మీలో ఎవరు కోటీశ్వరుడికి చిరంజీవి తీసుకున్న దాని కన్నా ఎక్కువ .సరిగ్గా ఇదే అంశాన్ని హైలైట్ చేసిన స్టార్ నిర్వాహకులు బిగ్ బాస్ కోసం ఎన్టీఆర్ ని ఒప్పించగలిగారు.మొత్తానికి మీలో ఎవరు కోటీశ్వరుడు తర్వాత ఓ పెద్ద స్టార్ హోస్ట్ చేస్తున్న కార్యక్రమ తెలుగు బుల్లి తెర ప్రేక్షకుల్ని ఆలరించబో తోంది.ఇప్పటి దాకా ఎన్టీఆర్ లోని నటనా వైదుష్యాన్ని మాత్రమే చూసిన ప్రేక్షకులకి ఆయనలోని ఇంకో కోణాన్ని చూసే అవకాశం దొరికినట్టే.వెండితెర మీద వెలిగిపోయినట్టే బుల్లితెర మీద కూడా ఎన్టీఆర్ విశ్వరూపదర్శనం కోసం ఎదురు చూద్దాం..

Leave a Reply