ఇది నా సెకండ్ ఇన్నింగ్స్ : తణికెళ్ల భరణి

0
351

Posted [relativedate]

Tanikella Bharani at Allu Ramalingaiah Award 2012 Function Photos

 

రచయిత నుండి తర్వాత నటుడిగా మారిన వారిలో తణికెళ్ల భరణి గారు కూడా వస్తారు. కెరియర్ మొదట్లో సూపర్ హిట్లు అందించిన రచయిత ఇప్పుడు నటుడిగా స్థిరపడిపోయారు. నిన్న రిలీజ్ అయిన నరుడా డోనరుడా సినిమాలో హీరో సుమంత్ తర్వాత అంత వెయిట్ ఉన్న పాత్ర చేశారు భరణి. కెరియర్ లో ‘యమలీల’ తర్వాత ‘కనక మహాలక్ష్మి రికార్డింగ్ డ్యాన్స్’ ఆ తర్వాత ఈ సినిమానే తన పాత్ర సినిమా మొత్తం ఉంది అంటున్నారు. ఈ సినిమా తనకు సెకండ్ ఇన్నింగ్స్ లాంటిదని దీనితో మరో రెండు మూడు అవకాశాలు వచ్చే వీలు కలుగుతుందని అన్నారు భరణి.

ఇక కొన్ని కొన్ని సినిమాల్లో పాత్ర నిడివి చాలా తక్కువ ఉన్నా చేశానని.. కేవలం ఒక్క సీన్ లో కూడా నటించిన సినిమాలు చాలా ఉన్నాయని అన్నారు. అతడు సినిమాలో కేవలం తక్కువే సీన్లే ఉన్నా ఆ సినిమాలో తాను చెప్పిన ఆడు మగాడ్రా బుజ్జి అనేది సినిమా టైటిల్ గా కూడా వచ్చింది. పాత్ర చిన్నదా పెద్ద అన్న దాని కన్నా దానికి మనం ఎంత న్యాయం చేశామన్నది ఇంపార్టెంట్. సినిమాలో ఒకటి రెండు సీన్స్ అయినా ఇస్తున్నారంటే అది వారికి తన మీద ఉన్న గౌరవమని చేసుకుంటూ వచ్చానని అన్నారు తణికెళ్ల భరణి.

Leave a Reply