Sunday, September 26, 2021
HomeEntertainmentCinema Latestఉయ్యాలవాడ ఆగిపోవడంకు అసలు కారణం ఇదే..!

ఉయ్యాలవాడ ఆగిపోవడంకు అసలు కారణం ఇదే..!

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

చిరంజీవి 151వ చిత్రంగా స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత కథాంశం తెరకెక్కాల్సి ఉంది. గత అయిదు నెలలుగా మెగా ఫ్యాన్స్‌ ఈ ప్రాజెక్ట్‌ ఎప్పుడెప్పుడు ప్రారంభం అవుతుందా అని ఎదురు చూస్తున్నారు. దర్శకుడు సురేందర్‌ రెడ్డి చాలా నెలలుగా ఈ ప్రాజెక్ట్‌ కోసం స్క్రిప్ట్‌ను సిద్దం చేస్తున్నాడు. పరుచూరి బ్రదర్స్‌ పక్కా మాస్‌గా ఈ సినిమాకు డైలాగ్స్‌ను కూడా సిద్దం చేస్తున్నారు. ఆగస్టులో చిత్రాన్ని సెట్స్‌పైకి తీసుకు వెళ్తాం అంటూ నిర్మాత రామ్‌ చరణ్‌ ప్రకటించాడు. అంతా సాఫీగా జరగుతున్న సమయంలో అనుకోని కుదుపు మాదిరిగా చిత్రాన్ని క్యాన్సిల్‌ చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతుంది.

మెగా ఫ్యామిలీ నుండి ఈ విషయమై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కాని విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం స్క్రిప్ట్‌ పూర్తి అయిన తర్వాత అల్లు అరవింద్‌ ఒక లుక్కేశాడని, స్క్రిప్ట్‌ ఇప్పటి జనరేషన్‌కు తగ్గట్లుగా కాకుండా 1980, 90ల జనరేషన్‌కు తగ్గట్లుగా ఉందని, ఈ సినిమాపై అంత బడ్జెట్‌ను పెట్టడం పెద్ద రిస్క్‌ అంటూ తేల్చి చెప్పాడట. దాంతో నిర్మాత రామ్‌ చరణ్‌ వెనుకడుగు వేశాడు. స్క్రిప్ట్‌లో మార్పులు చేర్పులతో పాటు, పూర్తి కొత్తదనంతో స్క్రీన్‌ప్లేను డిజైన్‌ చేయమంటూ దర్శకుడికి చరణ్‌ సూచించాడు. ఉయ్యాలవాడ ప్రస్తుతానికి పక్కకు వెళ్లినట్లే అని చెప్పుకోవచ్చు. ఇందుకు ప్రధాన కారణం అల్లు అరవింద్‌ అని అంతా అంటున్నారు. ఈ విషయమై అధికారిక ప్రకటన కోసం  మెగా ఫ్యాన్స్‌ ఎదురు చూస్తున్నారు.

- Advertisment -
spot_img

Most Popular