Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
రామ్‌చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రానికి తాజాగా ‘రంగస్థలం 1985’ అనే టైటిల్‌ను ఖరారు చేసిన విషయం తెల్సిందే. అతి త్వరలోనే టీజర్‌ను కూడా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రం గత సంవత్సరం ఆగస్టులో ప్రారంభం అవ్వాల్సి ఉన్నా కూడా కొన్ని కారణాల వల్ల వాయిదాల మీద వాయిదాలు పడుతూ వచ్చింది. ఇటీవలే ప్రారంభం అయిన ఈ సినిమాను దసరా కానుకగా విడుదల చేయాలని మొదట భావించారు. అయితే షూటింగ్ ప్రారంభం అయిన తర్వాత కూడా కొన్ని అవాంతరాలు వచ్చాయి. దాంతో సినిమాను సంక్రాంతికి తీసుకు వెళ్లారు.
‘రంగస్థలం 1985’ చిత్రంలో ఒక ముఖ్య పాత్రలో రావు రమేష్‌ను ఎంపిక చేయడం జరిగింది. రావు రమేష్, సమంతల కాంబినేషన్లో కొన్ని సీన్స్‌ను కూడా చిత్రీకరించడం జరిగింది. ఏం జరిగిందో ఏమో కాని పాత్రకు రావు రమేష్ కంటే ప్రకాష్ రాజ్ ఎక్కువ న్యాయం చేస్తాడు అంటూ చిత్రీకరించిన సీన్స్‌ను కూడా తొలగించడం జరిగింది. దాంతో ఇప్పుడు దాదాపు నెల రోజుల పాటు అదనంగా చిత్రీకరించాల్సిన పరిస్థితి వచ్చింది. దానికి తోడు ఎండలు అధికంగా ఉన్న కారణంగా చిత్ర షూటింగ్‌ను రీ షెడ్యూల్ చేయడం జరిగింది. ఈ రెండు కారణాల వల్ల సినిమా సంక్రాంతికి వాయిదా పడ్డట్లుగా తెలుస్తోంది. ఈ చిత్రంలో చరణ్ పల్లెటూరు వ్యక్తిగా కనిపించబోతున్నాడు. చెవులు కూడా సరిగా వినిపించని వ్యక్తిగా చరణ్ కనిపించబోతున్నాడు.